Viral Video: నిప్పులు చిమ్మే ఫైర్ ఫ్రూట్ దోసె !! ఎప్పుడైనా తిన్నారా ?? వీడియో
దోసె.. దక్షిణాది భారతీయులు ఇష్టంగా తినే అల్పాహారంగా చెప్పవచ్చు. చాలామంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఈ డిష్‌ను ఎంచుకుంటారు.
దోసె.. దక్షిణాది భారతీయులు ఇష్టంగా తినే అల్పాహారంగా చెప్పవచ్చు. చాలామంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఈ డిష్‌ను ఎంచుకుంటారు. ఇందులో మసాలా దోసె, ఆనియన్‌దోసె, ఎగ్ దోసె, రవ్వ దోసె, ఇలా రకరకాల దోసెలు మనకు తెలుసు. అయితే ఢిల్లీలో ఒక వ్యాపారి నిప్పులు చిమ్మే ఫైర్ ఫ్రూట్ దోసెను తయారుచేస్తున్నాడు. ఢిల్లీలోని ఓ కాలనీలో ఉన్న ‘అయ్యర్‌జీ దోసె వాలే’ హోటల్‌లో ఈ వెరైటీ దోసె చేస్తున్నారు. ఇతర దోసలతో పోల్చుకుంటే ఈ దోస తయారీ కొంచెం వేరుగా ఉంటుంది. ముందుగా స్టవ్‌పైన పెనం పెట్టి దానిపైకి మంట వచ్చేలా చేస్తారు. ఆతర్వాత దోసె పిండిని వేస్తారు. ఆతర్వాత వెన్నతో గ్రీజ్ చేస్తారు. అనంతరం పన్నీర్, సాస్‌లు, మసాలా పదార్థాలు, డ్రై ఫ్రూట్స్‌తో పాటు కొన్ని రకాల పండ్ల ముక్కలు జోడిస్తాడు. చివరిగా దోసెను తురిమిన ఛీజ్‌తో టాప్ చేసి ముగిస్తాడు. ఈ దోసెను రుచి చూడడానికి అక్కడి స్థానికులు ఎగబడుతున్నారట.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: బర్గర్ తినండి.. సైకిల్ తొక్కండి.. బంపర్ ఆఫర్ ఇస్తున్న బేకరీ..! వీడియో