Indigo Flight: విమానంలో రక్తం కక్కుకుని చనిపోయిన ప్రయాణికుడు.. వీడియో.

|

Aug 24, 2023 | 9:48 PM

ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు రక్తం కక్కుకుని మరణించారు. ముంబై నుంచి రాంచీకి బయలుదేరిన విమానంలో ఆగస్టు 21 సాయంత్రం ఈ ఘటన సంభవించింది. సీకేడీ, ట్యూబరిక్యులోసిస్‌తో సతమతమవుతున్న 62 ఏళ్ల ప్రయాణికుడు ఒకరు అకస్మాత్తుగా రక్తం కక్కుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు కంగారు పడ్డారు. విషయం పైలట్‌కు తెలియజేయడంతో పైలట్ విమానాన్ని నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు.

ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు రక్తం కక్కుకుని మరణించారు. ముంబై నుంచి రాంచీకి బయలుదేరిన విమానంలో ఆగస్టు 21 సాయంత్రం ఈ ఘటన సంభవించింది. సీకేడీ, ట్యూబరిక్యులోసిస్‌తో సతమతమవుతున్న 62 ఏళ్ల ప్రయాణికుడు ఒకరు అకస్మాత్తుగా రక్తం కక్కుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు కంగారు పడ్డారు. విషయం పైలట్‌కు తెలియజేయడంతో పైలట్ విమానాన్ని నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది బాధితుడిని సమీపంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. కాగా, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. కిమ్స్ ఆసుపత్రి బ్రాండింగ్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ డీజీఎం ఎజాష్ షామీ ఈ వివరాలను వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...