Global Investors Summit: సమ్మిట్ లో పాల్గొన్న భారత దిగ్గజ పారిశ్రామికవేత్తలు.. ప్రారంభించిన సీఎం జగన్..(లైవ్)

|

Mar 03, 2023 | 11:43 AM

Global Investors Summit in Visakhapatnam Live Video: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహిస్తోంది. GIS 2023 కు విశాఖపట్నం సర్వం సిద్ధమైంది.

Global Investors Summit in Visakhapatnam Live Updates: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహిస్తోంది. GIS 2023 కు విశాఖపట్నం సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 9.45గంటలకు గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రారంభం కానుంది. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌ వేదికగా శుక్రవారం, శనివారం రెండురోజులపాటు ఈ సమ్మిట్‌ కోసం భారీ ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. దేశ విదేశాల నుంచి రాబోతున్న కార్పొరేట్‌ దిగ్గజాలకు కనీవినీ ఎరుగని రీతిలో ఏపీ ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ ఆహ్వానం పలుకుతోంది. రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌కి సర్వంసిద్ధం చేసింది. ఈ సమ్మిట్ కు 25 దేశాల నుంచి హైకమిషనర్లు, 15వేల మంది ప్రతినిధులు. ఇండియా నుంచి 35మంది టాప్‌ ఇండస్ట్రియలిస్ట్‌లు, బిజినెస్‌ టైకూన్స్‌, కార్పొరేట్‌ దిగ్గజాలు. ఏడుగురు కేంద్ర మంత్రులు, వీవీఐపీలు హాజరుకానున్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కి వస్తోన్న అతిథుల కోసం టాప్‌ లెవల్‌లో అరేంజ్‌మెంట్స్‌ చేసింది ఏపీ ప్రభుత్వం. దేశ విదేశీ పారిశ్రామిక దిగ్గజాలతోపాటు కేంద్ర మంత్రులు, వీవీఐపీలు వస్తుండటంతో సెక్యూరిటీపరంగానూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 7వేల మంది పోలీసులతో నగరమంతటా మోహరించింది. ఇక, అతిథుల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను సిద్ధంగా ఉంచింది ప్రభుత్వం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Follow us on