Education Policy: ఇక LKG నుంచి ఇంజనీరింగ్ వరకు అంతా తెలుగు మీడియంలోనే.. వీడియో.

|

Aug 06, 2023 | 9:53 AM

మాతృభాషలో బోధనే.. దేశంలోని యువ ప్రతిభకు న్యాయం చేస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సామాజిక న్యాయపరంగానూ జాతీయ విద్యా విధానం కీలకమన్నారు. భాషపై పట్టుంటేనే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉంటారని.. అందుకే దేశవ్యాప్తంగా సాంఘిక శాస్త్రం నుంచి ఇంజినీరింగ్‌ వరకు ఇక మాతృభాషలోనే విద్యా బోధన జరగనుందన్నారు. అభివృద్ధి చెందిన చాలా దేశాలు తమ భాష ద్వారే ప్రగతి సాధించాయని గుర్తు చేశారు.

నూతన జాతీయ విద్యావిధానంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా బోధనకు దేశంలో భాషలన్నింటికి ప్రాముఖ్యతను కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకూ సామాజిక న్యాయం అందించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భాషలతో రాజకీయాలు చేసే స్వార్థపరులు.. ఇక తమ దుకాణాలు మూసుకోవాల్సిందేనన్నారు. జాతీయ విద్యా విధానం ప్రారంభించి మూడేళ్లు పూర్తైన సందర్భంగా ప్రగతి మైదాన్‌లో ‘అఖిల భారతీయ శిక్షా సమాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. మాతృభాషలో బోధనే.. దేశంలోని యువ ప్రతిభకు న్యాయం చేస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సామాజిక న్యాయపరంగానూ జాతీయ విద్యా విధానం కీలకమన్నారు. భాషపై పట్టుంటేనే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉంటారని.. అందుకే దేశవ్యాప్తంగా సాంఘిక శాస్త్రం నుంచి ఇంజినీరింగ్‌ వరకు ఇక మాతృభాషలోనే విద్యా బోధన జరగనుందన్నారు. అభివృద్ధి చెందిన చాలా దేశాలు తమ భాష ద్వారే ప్రగతి సాధించాయని గుర్తు చేశారు. జాతీయ విద్యా విధానంతో హీన భావనను తొలగించే ప్రయత్నం ఆరంభమైందన్న ప్రధాని.. ఐక్యరాజ్యసమితిలోనూ భారత భాషలోనే మాట్లాడానని, కాకపోతే వాళ్లు అర్థం చేసుకొని చప్పట్లు కొట్టేందుకు కాస్త సమయం పడుతుందని అయినా ఫర్వాలేదని మోదీ వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...