Monsoon Rains: ఈ ఏడాది వర్షపాతం తక్కువే..! లా, నినా ప్రభావంతో తగ్గనున్న వర్షపాతం
ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ ‘స్కైమెట్’ తాజాగా అన్నదాతలకు పిడుగులాంటి వార్త చెప్పింది. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువే ఉండొచ్చని అంచనా వేసింది.
ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ ‘స్కైమెట్’ తాజాగా అన్నదాతలకు పిడుగులాంటి వార్త చెప్పింది. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువే ఉండొచ్చని అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ కాలానికి వర్షాలు దీర్ఘకాల సగటులో 94 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువే ఉండొచ్చని స్కైమెట్ జనవరిలోనే ప్రాథమికంగా అంచనా వేసింది. ఏప్రిల్ లో మరోసారి ఎల్ నినో అంచనాల ఆధారంగా తమ విశ్లేషణ తెలియజేస్తామని ప్రకటించింది. లానినా ప్రభావంతో నైరుతి రుతుపవన కాలంలో గత నాలుగు సీజన్ల నుంచి సాధారణం, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని ఇప్పుడు లానినా ముగిసిం ఎల్ నినో పెరుగుతోంది. వర్షాకాలానికి దీని ప్రభావం మరింత పెరుగుతుంది. దీనివల్ల వర్షాల సీజన్ బలహీనంగా ఉండొచ్చు అని స్కైమెట్ ఎండీ జతిన్ సింగ్ వెల్లడించారు. ఉత్తర భారత్, మధ్య భారత్ లోని ప్రాంతాలు ఎక్కువ వర్షాభావాన్ని ఎదుర్కొంటాయని స్కైమెట్ అంచనా వేస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో జులై, ఆగస్ట్ లో సరైన వర్షపాతం ఉండకపోవచ్చని పేర్కొంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉంటాయని తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..