Telcom New Rules: ఇష్టమొచ్చినట్టు సిమ్‌ కార్డులు కొంటే కుదరదు.. కేంద్రం న్యూ రూల్స్‌..!

|

Aug 20, 2023 | 9:33 AM

కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై సిమ్ కార్డ్ డీలర్స్‌పై పోలీస్ వెరిఫికేషన్ చేస్తామని వెల్లడించారు. బల్క్ కనెక్షన్‌లు తీసుకున్న వారి డిస్‌కంటిన్యూ చేస్తామని తెలిపారు. ఇలాంటి కనెక్షన్లతోనే భారీ మోసాలు జరుగుతున్నాయని, అందుకే వాటిపై దృష్టి సారించామని చెప్పారు. ఇప్పటికే క్రైమ్స్‌లో ఇన్వాల్వ్ అయిన 52 లక్షల కనెక్షన్స్‌ని ఇప్పటికే డీయాక్టివేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై సిమ్ కార్డ్ డీలర్స్‌పై పోలీస్ వెరిఫికేషన్ చేస్తామని వెల్లడించారు. బల్క్ కనెక్షన్‌లు తీసుకున్న వారి డిస్‌కంటిన్యూ చేస్తామని తెలిపారు. ఇలాంటి కనెక్షన్లతోనే భారీ మోసాలు జరుగుతున్నాయని, అందుకే వాటిపై దృష్టి సారించామని చెప్పారు. ఇప్పటికే క్రైమ్స్‌లో ఇన్వాల్వ్ అయిన 52 లక్షల కనెక్షన్స్‌ని ఇప్పటికే డీయాక్టివేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. పోలీస్‌ వెరిఫికేషన్‌తో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తైన తరవాతే సిమ్ డీలర్స్‌కి అనుమతినిచ్చేలా నిబంధనలు తీసుకు రానున్నట్టు అశ్వినీ వైష్ణవ్ వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలూ విధిస్తామని హెచ్చరించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సంచార్ సాతీ పోర్టల్‌ని ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా 52 లక్షల కనెక్షన్స్‌ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు తేలింది. వెంటనే వాటిని గుర్తించి డీయాక్టివేట్ చేసింది. అక్రమంగా సిమ్‌ కార్డులు అమ్ముతున్న 67 వేల మంది డీలర్లను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ ఏడాది మే నుంచి 300 సిమ్ కార్డ్ డీలర్స్‌పై కేసులు నమోదు చేసింది కేంద్రం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...