OnePlus: వన్ ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్.. 5వేలకే ఫోన్.. కానీ కండిషన్స్ అప్లై.

|

Aug 17, 2023 | 9:21 AM

స్మార్ట్‌ ఫోన్లలో వన్ ప్లస్ బ్రాండ్కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దానికి తగినట్లుగానే ఆ కంపెనీ సరికొత్త ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తూ మార్కెట్లో దూసుకెళ్తోంది. అయితే ఇటీవల కాలంలో వన్ ప్లస్ ఫోన్లు కొన్న యూజర్లు ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉన్నట్టుండి వారి ఫోన్‌ స్క్రీన్‌ గ్రీన్‌ కలర్‌లో మారిపోతుంది. ముఖ్యంగా వన్‌ప్లస్‌ 8 ప్రో, వన్‌ప్లస్‌ 8టీ, వన్‌ప్లస్‌ 9 ఆర్‌ ఫోన్లలో ఈ సమస్య ఎక్కువగా ఉండటంతో యూజర్లు సోషల్ మీడియాలో

స్మార్ట్‌ ఫోన్లలో వన్ ప్లస్ బ్రాండ్కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దానికి తగినట్లుగానే ఆ కంపెనీ సరికొత్త ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తూ మార్కెట్లో దూసుకెళ్తోంది. అయితే ఇటీవల కాలంలో వన్ ప్లస్ ఫోన్లు కొన్న యూజర్లు ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉన్నట్టుండి వారి ఫోన్‌ స్క్రీన్‌ గ్రీన్‌ కలర్‌లో మారిపోతుంది. ముఖ్యంగా వన్‌ప్లస్‌ 8 ప్రో, వన్‌ప్లస్‌ 8టీ, వన్‌ప్లస్‌ 9 ఆర్‌ ఫోన్లలో ఈ సమస్య ఎక్కువగా ఉండటంతో యూజర్లు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో దిగొచ్చిన కంపెనీ వారి సమస్యకు ఊరట కలిగిస్తూ ఓ ఆఫర్‌ ప్రకటించింది. గ్రీన్ స్క్రీన్తో ఇబ్బంది పడే యూజర్లకు జీవితకాల వారంటీని ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రత్యేక వోచర్లను అందిస్తోంది. ఈ ఆఫర్‌ ప్రకారం గ్రీన్ స్క్రీన్ ఉన్న ఫోన్ ఎక్స్చేంజ్ చేసి వన్ ప్లస్ 10r తీసుకోవచ్చన్నమాట. అయితే ఇందుకుగాను 5 నుంచి 10వేలు కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం వన్ ప్లస్ 10r ఫోన్‌ 35వేలు ఉంది. అయితే కంపెనీ 30వేల వోచర్ ఇవ్వనుండగా.. మిగితా 5వేలు కట్టేస్తే కొత్త ఫోన్ వస్తుంది. ఇది కేవలం ఇండియాలో ఉండే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లతో యూజర్లు ఇబ్బందులు పడడం వల్లే ఈ ఆఫర్ను తీసుకొచ్చినట్లు తెలిపింది. యూజర్లు దగ్గరలోని వన్ ప్లస్ స్టోర్కు వెళ్లి ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...