Watch Video: ఇదెక్కడి దోశరా బాబు.. వైరల్ అవుతున్న వెరైటీ కాంబినేషన్ దోశ

|

Jun 01, 2023 | 8:17 PM

సౌత్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ దోశ. చాలామంది దోశను ఇష్టంగా తింటారు. ఉల్లి దోశ, మసాల దోశ, మైసూర్ మసాల, రవ్వ దోశ, ఉప్మా దోశ లాంటి ఎన్నోరకాల డిష్‌లు నోరూరిస్తుంటాయి. అయితే ఓ వ్యక్తి విచిత్ర కాంబినేషన్‌లో పాన్ దోశను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

Watch Video: ఇదెక్కడి దోశరా బాబు.. వైరల్ అవుతున్న వెరైటీ కాంబినేషన్ దోశ
Paan Dosa
Follow us on

సౌత్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ దోశ. చాలామంది దోశను ఇష్టంగా తింటారు. ఉల్లి దోశ, మసాల దోశ, మైసూర్ మసాల, రవ్వ దోశ, ఉప్మా దోశ లాంటి ఎన్నోరకాల డిష్‌లు నోరూరిస్తుంటాయి. అయితే ఓ వ్యక్తి విచిత్ర కాంబినేషన్‌లో కొత్తగా పాన్ దోశను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. హ్యాపీ ఆనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియోను చూస్తే తమలపాకుతో తయారుచేసిన చేసిన గ్రీన్ బ్యాటర్‌ను దోశ పెనంపై పోయడం కనిపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి దోశపై వెన్నెను వేయడం చూడొచ్చు.

ఆపై క‌ట్ చేసిన్ పాన్‌, కిస్‌మిస్‌, ఆప్రికాట్స్‌, డ్రైఫ్రూట్స్‌ లాంటివి వేసి ఆపై పాన్ సిర‌ప్‌ను కూడా వేస్తాడు. ఈ వీడియోను చూసిన ప‌లువురు యూజ‌ర్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి కాంబినేషన్‌లో తయారుచేయడం అవ‌స‌ర‌మా అంటూ ఓ యూజర్ ప్రశ్నించాడు. ఇది పాన్ దోశనా లేక రేడియోయాక్టివ్ దోశనా అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. అయితే ఇప్పటివరకు ఈ వీడియోను 1.4 లక్షల మందికిపైగా వీక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..