అడవిలో సాధు జంతువులు తమకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతూనే జీవిస్తుంటాయి . సాధారణంగా పులులు, సింహాలు ఎక్కువగా జింకలను వేటాడుతుంటాయి. అయితే తాజాగా ఓ జింక చేసిన తెలివైన పని అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఓ చిరుత కంటికి జింక కనిపించింది, అది వెంటనే వేటకు దిగి ఆ జింకను పట్టుకుంది. ఆ జింక పరిగెత్తి పోయే ఆలోచన చేసింది కానీ చిరుత జింకను పంజా కింద నొక్కిపెట్టింది. వెంటనే చనిపోయిన దానిలా ఉలుకూ పలుకూ లేకుండా అలా నేలమీదే ఉండిపోయింది. అదే సమయానికి హైనా పరిగెత్తకుంటూ వచ్చి అక్కడున్న చిరుతను తరిమేసింది. జింకను తిందామనుకుని పళ్లతో జింకను పట్టుకుని అటూ ఇటూ ఊపింది. కానీ చిరుత మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోకుండా దాని దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ హైనా మొదట చిరుతను తరిమేసి.. ఆ తర్వాత చచ్చిన జింకను తిందామనుకుని చిరుతపైకి వెళ్లి దాన్ని తరిమేసింది.
అయితే చచ్చిపోయిన జంతువులా నటించిన జింక కాస్తా పైకి లేచి వేగంగా పరుగులు తీసింది. హైనా ఆ జింక కోసం పరిగెత్తినా అప్పటికే జింక చాలా దూరం వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వామ్మో జింకకు ఎంత తెలివో అంటూ నెటీజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో తెలివిని ఉపయోగించడమే సరైన సమయస్పూర్తి అని మరికొందరు తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.
The Oscar goes to… pic.twitter.com/OekFkieRVC
— The Figen (@TheFigen_) March 27, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.