సాధారణంగా మనం రోజూ చూస్తూనే ఉంటాం. పిల్లి చాలా అల్లరి చేస్తుంటుంది. పెంపుడు జంతువుల్లో కుక్క తరువాత జనాలు ఎక్కువగా పెంచుకునేది పిల్లినే. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లోనూ పిల్లి తప్పక ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లోనూ చాలామంది పిల్లిని పెంచుకుంటారు. అయితే, కొన్ని పిల్లులు చాలా అల్లరి చేస్తుంటాయి. తన యజమానుల పట్ల విశ్వాసంతో ఉంటూనే.. వారితో సరదాగా గడిపేస్తాయి. అవి చేస్తే రచ్చ చూడటానికి కనువిందుగా ఉంటుంది. ఇక కుక్క మాదిరిగానే.. పిల్లులు కూడా తమ యజమానికి ఇంట్లోకి ఎలాంటి ప్రమాదకరమైన జీవులు రాకుండా అడ్డుకుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోలో చెట్ల మధ్య బంగారు వర్ణపు పిల్లి ఒకటి, నలుపు రంగులో ఉన్న పిల్లి ఒకటి ఉన్నాయి. అయితే, ఈ పిల్లులు సరదాగా ఆడుకుంటుండగా.. అంతలోనే ఊహించని ఉపద్రవం వచ్చిపడింది. ఓ పాము రయ్‌మంటూ పిల్లుల వద్దకు దూసుకొచ్చింది. బంగారు వర్ణంలో ఉన్న పిల్లి వద్దకు ఆ పాము వచ్చింది. ఆ పిల్లి వంక తదేకంగా చూస్తూ.. ఒక్కసారిగా అటాక్ చేయబోయింది పాము. అయితే, ఆ పిల్లి ఏమైనా తెలివితక్కువదా ఏంటి? అది కాటు వేయబోయే గ్యాప్‌లోనే.. దానికంటే వేగంగా స్పందించి ఒక్క పంచ్ ఇచ్చింది. పిల్లి తన కాలితో గట్టిగా పంచ్ ఇవ్వడంతో పాము బిత్తర పోయింది. మరోసారి కూడా అలాగే కాటు వేయబోగా.. రెట్టింపు బలంతో పంజాతో గట్టిగా కొట్టింది. దెబ్బకు బిత్తరపోయింది పాము. అక్కడి నుంచి బతుకు జీవుడా అంటూ జారుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. పిల్లి వేగం, సమయస్ఫూర్తి, ధైర్యం చూసి దానిని మెచ్చుకుంటున్నారు. పిల్లి దెబ్బ.. పాము అబ్బా అన్నదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
The average cat’s reaction time is approximately 20-70 milliseconds, which is faster than the average snake’s reaction time, 44-70 milliseconds. pic.twitter.com/96wXACOBnd
— Weird and Terrifying (@Artsandcultr) March 6, 2023
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..