ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై సోమవారం వాడి వేడి వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పీఎంఎల్‌ఏ చట్టంపై వాదనలు వినిపించారు ఇరుపక్షాల న్యాయవాదులు. కవిత కేసులో విచారణ మూడు వారాలకు వాయిదా వేస్తూ సూప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
లిఖితపూర్వక నోట్ సమర్పించమని సుప్రీం ఆదేశించింది. PMLA సెక్షన్లపైనే వాదన ప్రధానంగా సాగింది. ఇదిలా ఉంటే మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరపడంపై కవిత సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో నళిని చిదంబరం కూడా ఇదే విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నళిని పిటిషన్‌కు కవిత పిటిషన్‌కు ట్యాగ్ చేసింది సుప్రీంకోర్టు. విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
కాగా, కవితను ఈడీ అధికారులు ఇప్పటి వరకు మూడుసార్లు విచారించారు. మూడు రోజులు మొత్తం 27 గంటలకు పైగా సుదీర్ఘ విచారణ సాగింది. మూడోరోజు విచారణ పూర్తయిన తర్వాత మళ్లీ విచారణ ఉంటే మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని కవితతో పాటు ఆమె న్యాయవాది సోమా భరత్‌కు వివరించింది ఈడీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..