Thummala Nageswara Rao: వస్తానంటే వద్దంటామా.. తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ ఆఫర్..!

|

Aug 24, 2023 | 2:14 PM

ఖమ్మం, ఆగస్టు 24: బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన అనంతరం.. పలు నియోజకవర్గాల్లో టిక్కెట్ దక్కని ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధిష్టానం బుజ్జగించినప్పటికీ వెనక్కితగ్గడం లేదు. తమ నేతలకు టికెట్ దక్కకపోవడంతో ఆయా నాయకుల అనుచరులు సైతం అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.

Thummala Nageswara Rao: వస్తానంటే వద్దంటామా.. తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ ఆఫర్..!
Thummala Nageswara Rao - Renuka Chowdhury
Follow us on

ఖమ్మం, ఆగస్టు 24: బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన అనంతరం.. పలు నియోజకవర్గాల్లో టిక్కెట్ దక్కని ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధిష్టానం బుజ్జగించినప్పటికీ వెనక్కితగ్గడం లేదు. తమ నేతలకు టికెట్ దక్కకపోవడంతో ఆయా నాయకుల అనుచరులు సైతం అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలో టికెట్ దక్కని వారికి కాంగ్రెస్ ఆఫర్ ఇస్తుండటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పాలేరు టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తుమ్మలకు అధిష్టానం బుజ్జగించినప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గలేదని సమాచారం.. ఈ క్రమంలో తుమ్మల నాగేశ్వరరావుపై కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుమ్మల కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరుగుతోందని.. నిజంగా తుమ్మల వస్తానంటే కాదనను అంటున్నారు. భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలం జగ్గాయిగూడెంలో పల్లె నిద్ర చేసిన రేణుకాచౌదరి KCRపై విమర్శలు గుప్పించారు. పల్లె నిద్రలో భాగంగా విలేజ్‌లో సందడి చేశారు రేణుక చౌదరి. రైతులతో కలిసి ట్రాక్టర్ నడుపుకుంటూ..పాటలు పాడుతూ..నాట్లు వేశారు రేణుకా చౌదరి. ఈ సందర్భంగా ఆమె తుమ్మల వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.

పాలేరు టిక్కెట్ దక్కకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తితో ఉండటంతో అధిష్టానం.. బుజ్జగింపులు ప్రారంభించింది. ఈ క్రమంలో నిన్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆయనతో మాట్లాడారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న తుమ్మల రేపు ఖమ్మం వెళ్లనున్నారు. తుమ్మలకు టికెట్‌ ఇవ్వకపోవడంపై అనుచరుల అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల్లో తుమ్మల అనుచరులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. ఆయన నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్న అనుచరులు ప్రకటించారు. తుమ్మలకు టికెట్‌ దక్కకపోవడంతో ఇప్పటికే నిరనసకు దిగిన అనుచరులు.. రహస్య సమావేశాలు కూడా పెట్టుకుని భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించుకున్నట్లు సమాచారం.. శుక్రవారం తుమ్మల నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో.. ఆయనతో మాట్లాడాక ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఫాలో అవుతామని పేర్కొంటున్నారు.

రేణుకా చౌదరి ఏం మాట్లాడారంటే..

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే రేణుకా చౌదరి తుమ్మల గురించి మాట్లాడటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, తుమ్మల నాగేశ్వరరావు రేపు భవిష్యత్ కార్యచరణ కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న తుమ్మల రేపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి