Union Minister Kishan Reddy: ఆ భూమిని శాశ్వతంగా ఇవ్వండి.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి కిషన్ రెడ్డి లేఖ..

|

Aug 23, 2023 | 5:32 PM

రక్షణ మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి కోసం, నగరంలో పౌరుల జీవన సౌలభ్యం కోసం అనేక స్నేహపూర్వక నిర్ణయాలు తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్.. ఆ ప్రాంతంలో నివసించే ప్రజల సౌకర్యార్థం కొంత భూమిని అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో ప్రయాణించే ప్రజలకు రక్షణ శాఖ తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రయోజనాన్ని అందించింది. ఇలాంటి ప్రజాప్రయోజన నిర్ణయాలను రక్షణ శాఖ అనేకసార్లు తీసుకుంది. ఇందుకు ప్రత్యేకంగా..

Union Minister Kishan Reddy: ఆ భూమిని శాశ్వతంగా ఇవ్వండి.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి కిషన్ రెడ్డి లేఖ..
Union Ministers Kishan Reddy And Rajnath Singh
Follow us on

దినదినాభివృద్ధి చెందుతూ విశ్వనగరంగా మారుతున్న భాగ్యనగరంలో జనాభాకు అనుకూలంగా మౌలిక వసతులు కూడా కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే నగరంలో మెహిదీపట్నంలో నిర్మించ తలపెట్టిన స్కైవాక్ కోసం రక్షణ శాఖ భూమిని శాశ్తంగా బదిలీ చేయాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి లేఖ రాశారు. మెహిదీపట్నంలోని రక్షణ శాఖకు చెందిన భూమిని శాశ్వతంగా రాష్ట్రానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి.

కిషన్ రెడ్డి రాసిన లేఖ సారాంశం ఇలా ఉంది..

‘రక్షణ మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి కోసం, నగరంలో పౌరుల జీవన సౌలభ్యం కోసం అనేక స్నేహపూర్వక నిర్ణయాలు తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్.. ఆ ప్రాంతంలో నివసించే ప్రజల సౌకర్యార్థం కొంత భూమిని అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో ప్రయాణించే ప్రజలకు రక్షణ శాఖ తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రయోజనాన్ని అందించింది. ఇలాంటి ప్రజాప్రయోజన నిర్ణయాలను రక్షణ శాఖ అనేకసార్లు తీసుకుంది. ఇందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.’

‘ఇప్పుడు మీ దృష్టికి అలాంటి ప్రజా ప్రయోజన సమస్యను తీసుకురావాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల వ్యూహాత్మక ప్రణాళికలు చేయకపోవడం వల్ల, వారి తప్పిదాల వల్ల హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో రైతు బజార్ చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొంటున్నాయి. దీంతో పాదాచారులు రోడ్లపై నడిచేటప్పుడు, ఆ ప్రాంతంలో జంక్షన్ దాటేందుకు ప్రయత్నించినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ కారణంగా మెహిదీపట్నంలోని రైతు బజార్ చుట్టూ స్కైవాక్‌లు, లిఫ్ట్‌లు, యుటిలిటీ జంక్షన్స్, మెట్ల నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రక్షణ శాఖకు సంబంధించిన భూమి అవసరం పడుతుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా.. 0.2 హెక్టార్ల(0.5 ఎకరాలు) రక్షణ భూమిని శాశ్వత బదలాయింపు కోసం అనుమతి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను. ఇది పాదాచారుల కష్టాలను చాలా వరకు తగ్గిస్తుంది. పరిసర ప్రాంతంలో వారి భద్రతను కాపాడుతుంది. తన విజ్ఞప్తికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు’ అని లేఖలో పేర్కొన్నారు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..