BRS vs BJP: ఉప్పల్‌-నారపల్లి ఫ్లైఓవర్‌ కేంద్రంగా పోస్టర్స్ వార్.. బీఆర్ఎస్ కౌంటర్‌కు బీజేపీ రియాక్షన్..

|

Mar 30, 2023 | 11:36 AM

హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం భారత్‌ మాల ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న ఉప్పల్‌-నారపల్లి ఫ్లై ఓవర్‌ నిర్మాణం పొలిటికల్ టర్న్ తీసుకుంది. 2018, మే 5న ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైనా .. ఇప్పటికీ 40శాతం పనులు కూడా పూర్తి కాలేదని కొంతమంది పిల్లర్లపై పోస్టర్లు అంటించారు.

BRS vs BJP: ఉప్పల్‌-నారపల్లి ఫ్లైఓవర్‌ కేంద్రంగా పోస్టర్స్ వార్.. బీఆర్ఎస్ కౌంటర్‌కు బీజేపీ రియాక్షన్..
Uppal Narapalli Flyover
Follow us on

హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం భారత్‌ మాల ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న ఉప్పల్‌-నారపల్లి ఫ్లై ఓవర్‌ నిర్మాణం పొలిటికల్ టర్న్ తీసుకుంది. 2018, మే 5న ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైనా .. ఇప్పటికీ 40శాతం పనులు కూడా పూర్తి కాలేదని కొంతమంది పిల్లర్లపై పోస్టర్లు అంటించారు. పోస్టర్లలో ప్రదాని మోదీ ఫోటో ముద్రించి సెటైరికల్‌గా ప్రశ్నలు సంధించారు. ఈ పోస్టర్లకు కౌంటర్ పోస్టర్లు పడటంతో రాజకీయం మరో లెవెల్‌కి వెళ్లిపోయింది. ఫ్లై ఓవర్‌కు ఉన్న అన్ని పిల్లర్లపైన వరుసగా పోస్టర్లు అంటించారు. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ మార్చి 27న ట్విటర్‌లో స్పందించారు. ఐదేళ్లలో తాము 35 ఫ్లైఓవర్ ప్రాజెక్టులు పూర్తి చేశామని, కేంద్ర ప్రభుత్వం నగరంలోని రెండు ఫ్లైఓవర్లు కూడా నిర్మించలేకపోయిందని విమర్శించారు.

ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాహనదారులు, స్థానికంగా ఉండే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ఈ పిల్లర్లపై పోస్టర్లు ఎవరు అంటించారు? ఎప్పుడు అంటించారు? ఎవరు చెబితే అంటించారనే చర్చ సాగుతోంది. దీనిపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే బీజేపీని బద్నాం చేసేందుకే పోస్టర్లు అంటించారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ ట్వీట్లకు కౌంటర్‌గా.. పిల్లర్లపై పోస్టర్లు వేసి చురకలంటించారు బోడుప్పల్ 19వ డివిజన్‌ కార్పొరేటర్ పవన్‌. మార్చి 27న పేపర్‌లో వచ్చిన కథనాన్ని పోస్టర్‌గా అంటించి.. వాస్తవాలు తెలుసుకోలని సూచించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఆలస్యానికి కారణం.. విద్యుత్, వాటర్ లైన్లను ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సరైన సమయంలో షిప్ట్ చేయకపోవడమేనన్నారు.

పోస్టర్స్..

Poster War

ప్రస్తుత కేంద్ర పర్యాటక మంత్రి.. గతంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు రాసిన లేఖను ప్రస్తావించారు. జూన్ 2020లో.. రాసిన ఆ లేఖలో అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ నేషనల్ హైవే 202లో భాగమని.. ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ కోసం 76 కోట్లను మంజూరు చేశారని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ బాధితులకు ఇంతవరకు పరిహారాన్ని అందించకపోవడాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారన్నారు. తప్పంతా మీ దగ్గర పెట్టుకుని ఇతరుల మీద నెపం వేయడం సరికాదన్నారు బీజేపీ కార్పొరేటర్‌.

మొత్తానికి పోస్టర్ల రాజకీయం రంజుగా మారినా స్థానికుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. విమర్శలు మాని పనులు పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..