Hyderabad: హైదరాబాద్‌లో గన్‌ కల్చర్‌ విస్తరిస్తోందా.? గన్స్‌ అంత ఈజీగా లభిస్తున్నాయా?

| Edited By: Narender Vaitla

Aug 24, 2023 | 5:45 PM

అదే హోటల్లో పనిచేస్తున్న కేరళకి చెందిన రతీష్ అనే వ్యక్తితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ హోటల్లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఖాళీ ఉండడంతో ఆ పోస్టు కోసం ఇద్దరి మధ్య పోటీ వచ్చింది . దేవేందర్ పనితీరు మంచిగా ఉండటంతో ఇతనికి జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చారు హోటల్ వాళ్ళు. దీంతో దేవేందర్ పై రితేష్ కోపం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి...

Hyderabad: హైదరాబాద్‌లో గన్‌ కల్చర్‌ విస్తరిస్తోందా.? గన్స్‌ అంత ఈజీగా లభిస్తున్నాయా?
Hyderabad
Follow us on

హైదరాబాద్ లో గన్‌ల మోత కలకలం సృష్టిస్తోంది, ఒకప్పుడు హైదరాబాద్‌ శివారు ప్రాంతాలకే విస్తరించిన గన్‌ కల్చర్‌ తాజాగా నగరం మొత్తం వ్యాపించింది. తెలంగాణ లో గన్‌ల మోత కలకలం సృష్టిస్తోంది. బుధవారం మియాపూర్‌లోని మదీనాగూడలో ఉన్న సందర్శిని హోటల్ లో జరిగిన కాల్పుల ఘటన మరోసారి హైదరాబాదులో తుపాకుల కల్చర్ ఏరకంగా పెరిగిపోయిందో అనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.. కలకత్తాకి చెందిన దేవేందర్ తొమ్మిదేళ్లుగా సందర్శిని హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

అదే హోటల్లో పనిచేస్తున్న కేరళకి చెందిన రతీష్ అనే వ్యక్తితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ హోటల్లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఖాళీ ఉండడంతో ఆ పోస్టు కోసం ఇద్దరి మధ్య పోటీ వచ్చింది . దేవేందర్ పనితీరు మంచిగా ఉండటంతో ఇతనికి జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చారు హోటల్ వాళ్ళు. దీంతో దేవేందర్ పై రితేష్ కోపం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి రితేష్‌ను హోటల్‌ వాళ్లు ఉద్యోగం నుంచి తొలగించారు దీంతో దేవేందర్ పై కోపం పెంచుకున్న అతన్ని చంపాలనుకున్నాడు టైం చూసికాపు కాసి పక్కా ప్లానింగ్ ప్రకారం కాల్పులు జరిపాడు.

రియల్ ఎస్టేట్ గొడవల్లో తుపాకులు…

ఇక హైదరాబాద్‌లో అయితే రియల్‌ మాఫియా విచ్చలవిడిగా తుపాకులను కొనుగోలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం సరిహద్దుల్లో మట్టారెడ్డి గ్యాంగ్ జరిపిన కాల్పులు సైతం కంట్రీమేడ్‌ వెపన్‌తో చేసిన పనిగా పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్‌ నుంచి కారులో బీహార్‌కు పంపి రెండు వెపన్స్‌ను రూ.30 వేలకు తెప్పించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. తాజాగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో రెండు తుపాకులనూ యూపీ నుంచి బస్సుల్లో హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్టు గుర్తించారు. బేగంపేటలో సైతం అన్నదమ్ముల మధ్య పంచాయతీ కోసం బీహార్‌ నుంచి తుపాకీ కొని తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

గన్స్ పై తగ్గిన నిఘా…

గతంలో హైదరాబాద్‌కు స్పెషల్‌ ముఠా ద్వారా వెపన్స్ తీసుకొచ్చేవారు. వాటిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేసి పట్టుకునేవాళ్లు. అయితే హైదరాబాద్ లో పని చేస్తున్న యూపీ, బిహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కూలీలు.. తమ ప్రాంతాల నుంచి గన్లను తీసుకొస్తున్నారు. కేవలం కాల్పుల ఘటన జరిగిన తర్వాత మాత్రమే పోలీసులు గన్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయో బయటపెడుతున్నారు. హైదరాబాద్‌ రియల్టర్ల మధ్య కాల్పులు, గ్యాంగ్‌ల మధ్య వార్‌ నుంచి చోరీలకు, చైన్‌స్నాచింగ్‌లకు, హత్యల కుట్రలకు ఇంత ఈజీగా వెపన్స్‌ దొరుకుతుండడంతో నేరాలకు పాల్పడుతున్నారు. నగర శివారులో మరోసారి కాల్పుల మోత మారుమోగింది. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరు రియల్టర్లపై కాల్పులు జరిపి హత్య చేసిన నిందితులను గుర్తించకపోయినా, వారు వినియోగించిన ఆయుధం మాత్రం అక్రమమే అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

లెసైన్స్‌డ్‌ ఆయుధమున్న వారు నేరుగా కాల్పులు జరిపే అవకాశాలు తక్కువగా ఉండటంతో రియల్టర్లపై కాల్పులకు కంట్రీమేడ్‌ ఆయుధమే వాడి ఉంటారని భావిస్తున్నారు. దీంతో అక్రమ ఆయుధాల ఉనికి మరోసారి నగరంలో బహిర్గతమైంది. సంతలో సరుకులా లభిస్తున్న అక్రమ ఆయుధాలకు ఇతర రాష్ట్రాల గ్యాంగులు సరఫరా చేసిన ఘటనలను పోలీసులు గతంలో గుర్తించారు. రియల్‌ వ్యాపారంలో వీటి వినియోగం ఎక్కువగా బయటపడటం గమనార్హం. కొందరు అడ్డదారుల్లో ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టేటస్‌ కోసం కొందరు, భయాందోళనలకు గురి చేసేందుకు మరికొందరు ఆక్రమంగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. సిటీ కల్చర్‌లో తుపాకీ స్టేట్‌స్ గా మారింది. ఒకప్పుడు ప్రముఖులకు, ప్రాణభయం ఉన్న వారికి మాత్రమే పలు రకాలుగా ఆరా తీసిన తర్వాత లైసెన్సు లభించేది. ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో సుమారు 7 వేల లెసెన్స్‌డ్‌ వెపన్స్‌ ఉన్నాయి. ఇంకా వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..