Jupally Rameswar Rao: జూపల్లి రామేశ్వరరావుకు మరో అరుదైన గౌరవం.. మైహోమ్‌ గ్రూప్‌‌కు అంతర్జాతీయ అవార్డు ప్రదానం..

| Edited By: Narender Vaitla

Jul 22, 2023 | 2:42 PM

Global Safety Summit awards: ఓ సామాన్యుడి అసామాన్య విజయానికి ప్రతీకగా.. నిర్మాణరంగ బాహుబలికి అంతర్జాతీయ అవార్డు లభించింది. My Home గ్రూప్‌ చైర్మన్‌ డా. జూపల్లి రామేశ్వర్‌రావును ప్రతిష్టాత్మక 'GSS గ్లోబల్ సేఫ్టీ అవార్డు' వరించింది. మైహోమ్‌ గ్రూప్‌ తొమ్మిది ప్రాజెక్టులకు బెస్ట్‌ సేఫ్టీ, హెల్త్‌, అండ్‌ ఎన్విరాన్మెంట్‌ అవార్డు దక్కింది.

Jupally Rameswar Rao: జూపల్లి రామేశ్వరరావుకు మరో అరుదైన గౌరవం.. మైహోమ్‌ గ్రూప్‌‌కు అంతర్జాతీయ అవార్డు ప్రదానం..
Jupally Rameswar Rao
Follow us on

My Home Group – Global Safety Summit awards: మైహోమ్‌, ఇది పేరు కాదు, నమ్మకానికి నిలువెత్తు బ్రాండ్‌!. తెలుగు ప్రజల చెక్కుచెదరని విశ్వాసానికి ఒకే ఒక్క అడ్రస్‌ మైహోమ్‌!. 36ఏళ్ల ప్రయాణం-ఎన్నో ప్రాజెక్టులు, ప్రతిదీ స్పెషలే!. Construction, Cement, Power, Consultancy and Education… ఇలా ఏ రంగంలో చూసుకున్నా MY Home అంటే పేరు కాదు.. ఒక ట్రెండ్‌ సెట్టర్‌!. అందుకే, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎన్నో ఎన్నెన్నో అద్భుత విజయాలను తన ఖాతాలో వేసుకుంది మైహోమ్‌ గ్రూప్‌. విశ్వనగరం హైదరాబాద్‌లో ఎన్నో ల్యాండ్‌ మార్క్స్‌ను క్రియేట్‌ చేసింది. మోడ్రన్‌ హోమ్స్‌, ప్రీమియం కంఫర్ట్స్‌ అందించడంలో తిరుగులేని బ్రాండ్‌గా నిలిచింది. యావత్‌ భారతదేశంలోనే గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్‌లో సరికొత్త ట్రెండ్‌ సెట్‌చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇవన్నీ ఓ సామాన్యుడు అసామాన్యంగా సాధించిన విజయాలు. ఆయనే, మైహోమ్‌ గ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు.

ఆయన సాధించిన విజయాలు అన్నీఇన్నీకావు, అందుకే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చి వరించాయ్‌. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. నిర్మాణ రంగంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పినందుకు అంతర్జాతీయ అవార్డు వరించింది. గ్లోబల్‌ సస్టైనబిలిటీ లీడర్‌గా ఇంటర్నేషనల్‌ పురస్కారం అందించింది GSS సంస్థ.

అసాధారణ విజయాలను సాధించినవారికే..

ఆరోగ్య, భద్రతారంగాల్లో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారంగా GSS అవార్డును పరిగణిస్తారు. భారత్‌లోని ప్రముఖ ఎన్జీవో-FIRE & SAFETY FORUM 2009 నుంచి ఏటా ఈ పురస్కారాలను అందిస్తోంది. FIRE & SAFETY రంగాల్లో అత్యుత్తమ ప్రమాణాలతో అసాధారణ విజయాలను సాధించినవారికి గ్లోబల్‌ సేఫ్టీ సమ్మిట్‌ ఇంటర్నేషనల్‌ అవార్డులు లభిస్తాయి. అలాంటి ప్రతిష్టాత్మక గ్లోబల్‌ సేఫ్టీ సమ్మిట్‌లో మైహోమ్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావుకు దక్కింది. లండన్‌లోని బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ వేదికగా ఈ అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. మైహోమ్‌ గ్రూప్‌ నుంచి వచ్చిన అన్ని 9 ప్రాజెక్టులూ అత్యుత్తమ వాతావరణం కలిగి ఉండడమే కాకుండా.. ఆరోగ్యానికి సోపానాలుగా ఉండడం వల్ల సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావుకు గ్లోబల్‌ సస్టైనబిలిటి ఇంటర్నేషనల్‌ లీడర్‌ అవార్డు, మైహోమ్‌ తొమ్మిది ప్రాజెక్టులకు బెస్ట్‌ సేఫ్టీ హెల్త్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్‌ అవార్డు దక్కాయి. బ్రిటన్‌ ప్రభుత్వం తరఫున ద లార్డ్‌ బ్రెనన్‌ చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన ఈ కార్యక్రమం లండన్‌ నగరంలో ఉన్న పార్లమెంటులోని హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో జరిగింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డులను మైహోమ్ గ్రూప్‌ ఎండీ శ్యామ్‌ రావు, ప్రాజెక్ట్స్‌ సీనియర్‌ ప్రెసిడెంట్‌ రవిసాయి, HSE హెడ్‌ భాస్కరరాజు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

కేవలం 50వేల రూపాయల పెట్టుబడితో మొదలైన మైహోమ్‌ ప్రస్థానం, ఇప్పుడు 1.3 బిలియన్‌ డాలర్ల మహా సామ్రాజ్యంగా రూపుదిద్దుకుంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా కుడికిళ్ల అనే ఓ చిన్న పల్లె నుంచి వచ్చిన జూపల్లి రామేశ్వరరావు… మూడు దశాబ్దాల్లోనే ఈ స్థాయికి ఎదిగారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జూపల్లి రామేశ్వరరావు.. 1979లో హోమియో డాక్టర్‌గా ప్రయాణం ప్రారంభించి, ఆ తర్వాత రియల్ ఎస్టేట్‌ రంగంలోకి ప్రవేశించారు. విలువలే పునాదిగా 1986లో మైహోమ్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అనంతరం, మహా సిమెంట్స్ పేరుతో సిమెంటు పరిశ్రమను స్థాపించారు. ఒకవైపు బిజినెస్‌లో బిజీగా ఉంటూనే హోమియో వైద్యంపై మక్కువతో JIMSను స్థాపించి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. టీటీడీ ట్రస్ట్‌ మెంబర్‌గా కొనసాగుతూ ఆధ్యాత్మక సేవలు కూడా అందిస్తున్నారు జూపల్లి రామేశ్వరరావు.

మైహోమ్‌ గ్రూప్‌ సాధించిన విజయాల వెనుక ఎంతో హార్డ్‌వర్క్‌తోపాటు ప్యాషన్‌ ఉందంటారు జూపల్లి రామేశ్వరరావు. లక్ష్యాలను అందుకోవడంలో సహచరులు, ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని చెబుతారు. తన ప్రతీ క్షణం, ప్రతీకణం క్వాలిటీ, సేఫ్టీ, సస్టైనబిలిటీ కోసమే వెచ్చించారు. నిర్మాణంలో నాణ్యత, నివాసంలో భద్రత.. ఈ రంగంలోనే స్థిరత్వం కలిగి అగ్రగామిగా దూసుకెళ్తున్నారు మైహోమ్‌ సంస్థ అధినేత. ఆయన ఏరోజూ విశ్రమించలేదు. తెలుగు రాష్ట్రాల్లో నాణ్యమైన నిర్మాణ సంస్థ ఉండాలన్న సంకల్పంతో.. దానికి తానే ముందడుగు వేయాలన్న దృఢనిశ్చయంతో మైహోమ్‌ గ్రూప్‌ని నెలకొల్పి.. పాతికేళ్లపైబడ్డ ప్రస్థానంలో విజయాలే గాని.. ఎలాంటి మచ్చ లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు మైహోమ్‌ నిర్మాణం ఎల్లలుదాటింది. దేశవ్యాప్త గోల్‌తో ముందుకు సాగుతోంది. మైకంట్రీ ఈజ్‌ మై హోమ్‌ అనే నినాదాన్ని ఎత్తుకుని.. ఇప్పటివరకు ఎలాంటి విలువలు పాటించారో.. వాటిని నిలబెట్టుకుంటూ తన రెక్కలను చాపి విస్తరిస్తోంది.

1991లో మైహోమ్‌ మంజరితో ప్రస్థానం..

1991లో మైహోమ్‌ మంజరితో ప్రస్థానం మొదలైంది. 50ఏళ్ల విజనరీ అప్పుడు ఎలాంటి వండర్స్‌ చేయబోతున్నారో చాలామందికి తెలియలేదు. 1993లో మై హోమ్‌ లక్ష్మీ నివాస్‌, మైహోమ్‌ గార్డెనియాని నిర్మించారు. 1997లో మైహోమ్‌ జూపల్లి, 1998లో మైహోమ్‌ ఫెర్న్‌హిల్‌, ఆ వెంటనే మై హోమ్‌ సరోవర్‌, మై హోమ్‌ మధుబన్‌..ఇలా హైదరాబాద్‌ అంతటా మై హోమ్‌ విస్తరించింది. నాణ్యతకు, నమ్మకానికి ప్రతికగా నిలిచింది.

ఇక కొత్త మిలీనియంలో సరికొత్త అధిరోహాలకు వెళ్లింది మై హోమ్‌ గ్రూప్‌! 2005లో మైహోమ్‌ నవద్వీప మాదాపూర్‌కే కొత్త ఐకాన్‌గా నిలిచింది. 2010లో మైహోమ్‌ హబ్‌, మదీనాగూడలో మైహోమ్‌ జెవెల్‌లతో హైదరాబాద్‌ రియల్‌ రంగంలో జోష్‌ పెంచింది. ఇక గచ్చిబౌలిలో నిర్మితమైన మైహోమ్‌ విహంగ గురించి చెప్పి తీరాలి. ప్రైమ్‌ లొకేషన్‌లో దాదాపు రెండు వేల అపార్ట్‌మెంట్ల ఈ మెగా ప్రాజెక్టు.. రెసిడెన్షియల్‌ సెగ్మెంట్‌లో ఐకాన్‌గా నిలిచింది. 2016లో మైహోమ్‌ అభ్ర లాంచ్‌ చేసి హైటెక్‌ సిటీకే ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. ఇక గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో రూపుదిద్దుకున్న మైహోమ్‌ క్రిషె.. హ్యపీ లివింగ్‌కు కేరాఫ్‌గా నిలిచింది. అదే ఏడాది పుప్పాల్‌గూడలో లాంచ్‌ చేసిన MY HOME AVATAR భారీ ప్రాజెక్టును 2019లో పూర్తి చేసి దేశమంతా హైదరాబాద్‌వైపు చూసేలా చేసింది హై హోమ్‌ గ్రూప్‌. మోడ్రన్‌ హోమ్స్‌, ప్రీమియం కంఫర్ట్స్‌ అందించడంలో తిరుగులేని బ్రాండ్ గా నిలిచింది..MY HOME GROUP. అందుకు నిలువెత్తు నిదర్శనం 2020లో ఆవిష్కృతమైన MY HOME BHOOJA. హైటెక్‌ సిటీలో రూపుదిద్దుకున్న మైహోమ్‌ భూజా.. దేశంలోనే గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్‌లో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసింది. ఇక కమర్షియల్‌ ప్రాజెక్ట్స్‌ విషయానికి వస్తే, మైహోమ్‌ స్కైవ్యూ, మైహోమ్‌ Twitza ఆసియాలోనే అద్భుత ప్రాజెక్టులుగా అభినందనలు అందుకున్నాయి. ఆకాశాన్నంటే భవంతులు నిర్మించడమే కాదు..ఆధ్యాత్మికతను పంచుతూ ఆలయాలను నిర్మించడం MY HOME ప్రత్యేకత. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మైహోమ్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేస్తున్న మరో కొత్త లాండ్‌మార్క్‌..MY HOME SAYUK. త్వరలోనే సయూక్‌ అందుబాటులోకి వస్తోంది.

మైహోమ్‌కు ఎన్నో అవార్డులు..

మైహోమ్‌ అంటేనే క్లియర్‌ టైటిల్స్‌, క్వాలిటీ కన్‌స్ట్రక్షన్స్‌, ఆన్‌టైమ్‌ డెలివరీ. అందుకే, మైహోమ్‌ నిర్మాణాలకు గోల్డ్‌ రేటింగ్స్‌ క్యూకడుతూ ఉంటాయ్‌!. ఎందుకంటే, ప్రకృతిని కాపాడుతూ పర్యావరణహితంగా కన్‌స్ట్రక్షన్స్‌ చేపడుతుంది మైహోమ్‌. నిర్మాణ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును, వినియోగదారుల నమ్మకాన్ని పొందుతోన్న మైహోమ్‌ గ్రూప్‌… తన ఉద్యోగులకు అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ఉద్యోగులు, వాళ్ల కుటుంబాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. అందుకే, మైహోమ్‌ గ్రూప్‌ను గోల్డెన్ పీకాక్‌లాంటి అవార్డులు కూడా సొంతమయ్యాయి!. బెస్ట్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ అవార్డులు, టాప్‌ మోస్ట్‌ HR లీడర్స్‌ అవార్డులు కూడా వరించాయి మైహోమ్‌ను.

నాణ్యత, విశ్వసనీయత, సమగ్రత ఇదే మైహోమ్‌ బిగ్గెస్ట్‌ స్ట్రెంత్‌. కస్టమర్ల నమ్మకం, అంచనాలకు అనుగుణంగా రెసిడెన్షియల్‌ అండ్‌ కమర్షియల్‌ సెగ్మెంట్లలో వండర్స్‌ సృష్టించింది మైహోమ్‌ గ్రూప్‌. గత మూడు దశాబ్దాలలో రెసిడెన్షియల్‌ అండ్‌ కమర్షియల్‌ సెగ్మెంట్లలో 21 ప్రాజెక్టులను మైహోమ్‌ గ్రూప్‌ విజయవంతంగా పూర్తిచేసింది. ఈ నిర్మాణాలతో 26 మిలియన్‌ SFTల Built-up areaతో చరిత్ర సృష్టించింది. 11 మిలియన్‌ SFTలు నిర్మాణంలో ఉన్నాయి. మరో 10 మిలియన్ SFT ప్లానింగ్‌ దశలో ఉన్నాయి. ప్రజల కష్టార్జితానికి కచ్చితమైన విలువ MY HOME తో సాధ్యమని ప్రతి ప్రాజెక్టులో రుజువైంది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంట్ హౌస్ అఫ్ లార్డ్స్ వేదికగా ప్రతిష్టాత్మక GSS గ్లోబల్ సేఫ్టీ అవార్డు అందుకోవడంతో మైహోమ్ సంస్థ, ఆ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు నిర్మాణ రంగ బాహుబలిగా విశ్వవ్యాప్త గుర్తింపు పొందారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..