Hyderabad: హైదరాబాద్‌లో తొలి WWE ఈవెంట్.. పోటీ పడనున్న 28 మంది ఇంటర్నేషనల్ స్టార్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

|

Aug 14, 2023 | 12:07 PM

WWE Superstar Spectacle: ఈ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ 'ఫ్రీకిన్' రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, వివాదరహిత WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌లతో సహా కీలక WWE సూపర్‌స్టార్స్ హాజరవుతారని ఆయన తెలిపారు. అలాగే WWE సూపర్‌స్టార్లు జిందర్ మహల్, వీర్, సంగ కూడా ఇందులో పోటీపడనున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో తొలి WWE ఈవెంట్.. పోటీ పడనున్న 28 మంది ఇంటర్నేషనల్ స్టార్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Hyd Wwe Superstar Spectacle
Follow us on

Hyderabad WWE Superstar Spectacle: హైదరాబాద్ క్రీడా అభిమానులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 8న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. గచ్చిబౌలిలోని GMC బాలయోగి ఇండోర్ స్టేడియం “WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్” ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు.

ఈ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ‘ఫ్రీకిన్’ రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, వివాదరహిత WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌లతో సహా కీలక WWE సూపర్‌స్టార్స్ హాజరవుతారని ఆయన తెలిపారు. అలాగే WWE సూపర్‌స్టార్లు జిందర్ మహల్, వీర్, సంగ కూడా ఇందులో పోటీపడనున్నారు. ఈ ఈవెంట్ టిక్కెట్లు www.bookmyshow.comలో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి వైఏటీ అండ్‌ సి డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌ ఆదివారం ఈ ఈవెంట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.


దేశంలోనే రెండోసారి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లో అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన 28 మంది డబ్ల్యూడబ్ల్యూఈ క్రీడాకారులు పోటీ పడనున్నట్లు మంత్రి తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..