Smart Phones under 5K: పాకెట్ ఫ్రెండ్లీ ఫోన్లు ఇవే.. ధర కేవలం రూ. 5000లోపు మాత్రమే..

|

Mar 29, 2023 | 4:20 PM

అతి తక్కువ బడ్జెట్ లో కూడా అవసరం మేరకు ఫీచర్లతో కొన్ని ఫోన్లు ఆకర్షిస్తున్నాయి. వాటిల్లో లావా, నోకియా, సామ్సంగ్ వంటి బ్రాండ్ లలో అందుబాటులో ఉన్నాయి. అవి కూడా కేవలం రూ. 5000 లోపు ధరలోనే. అవేంటో చూద్దాం రండి..

Smart Phones under 5K: పాకెట్ ఫ్రెండ్లీ ఫోన్లు ఇవే.. ధర కేవలం రూ. 5000లోపు మాత్రమే..
Smartphones
Follow us on

స్మార్ట్ ఫోన్.. ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది. అది లేకుండా అడుగు వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే మంచి ఫీచర్లున్న ఫోన్ కొనుగోలు చేయాలంటే బడ్జెట్ ఎక్కువే పెట్టుకోవాలి. అయితే అతి తక్కువ బడ్జెట్ లో కూడా అవసరం మేరకు ఫీచర్లతో కొన్ని ఫోన్లు ఆకర్షిస్తున్నాయి. వాటిల్లో లావా, నోకియా, సామ్సంగ్ వంటి బ్రాండ్ లలో అందుబాటులో ఉన్నాయి. అవి కూడా కేవలం రూ. 5000 లోపు ధరలోనే. మన అవసరాలను బట్టి ఈ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. రూ. 5000లోపు ధరలో టాప్ ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ లను చూద్దాం రండి..

జీయోనీ ఎఫ్ 8 నియో.. ఇది 5.45 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే వస్తోంది. ఫేస్ అన్‌లాక్, క్యూఆర్ కోడ్ స్కానర్ వంటి ఫీచర్లతో తక్కువ బడ్జెట్ ఫోన్ అవసరమయ్యే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది 32 GB స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. ఈ డ్యూయల్ సిమ్ ఫోన్‌లో ఆటో ఫోకస్‌తో కూడిన 8ఎంపీ ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్లూ, బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇది 4జీ సపోర్టు చేస్తుంది. 3000ఎంఏహెచ్ సామర్థ్యం కలిగి బ్యాటరీ ఉంది. దీని ధర అమెజాన్ లో రూ. 4,999 ఉంది.

నోకియా సీ01 ప్లస్.. మీరు 5000 లోపు ధరలో నోకియా ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, నోకియా సీ01 ప్లస్‌ బెస్ట్ ఆప్షన్. దీనిలో హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేతో ఉంటుంది. ఇది వేగవంతమైన పనితీరు కోసం ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో మన్నికైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది మీకు AI పవర్డ్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ ఉంటుంది. 4జీ కనెక్టవిటీ ఉంది. 5ఎంపీ ఏఎఫ్ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. రెండు వైపులా ఫ్లాష్‌తో వస్తాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 11.0 (గో ఎడిషన్)ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌ని బ్లూ లేదా గ్రే రంగులో పొందవచ్చు. దీని ధర అమెజాన్ లో రూ. 4,997గా ఉంది.

ఇవి కూడా చదవండి

లావా జెడ్61.. ఈ లావా ఫోన్ 8ఎంపీ వెనుకవైపు కెమెరాతో వస్తుంది. సూపర్‌నైట్, ఫిల్టర్, జీఐఎఫ్, పనోరమా, అనేక ఇతర మోడ్‌లను అందిస్తుంది. అలాగే 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సపోర్ట్ చేస్తుంది. ఐపీఎస్ హెచ్ డీ ప్లస్ డిస్ప్లే మీ గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీని శక్తివంతమైన బ్యాటరీ మీకు 16 గంటల టాక్-టైమ్‌,183 గంటల స్టాండ్‌బై టైమ్‌ని అందిస్తుంది. ఫోన్ 1.5Amp ఛార్జర్‌తో వస్తుంది, ఇది 2 గంటల 12 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. దీని ధర అమెజాన్ లో రూ. 4,990గా ఉంది.

ఎల్‪వైఎఫ్ సీకే ఎల్ఎస్-5002.. ఈ ఫోన్ ఐదు అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే తో వస్తోంది. దీనిలో 13 ఎంపీ ప్రైమరీ కెమరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ధృడమైన మరియు స్క్రాచ్ రెసిస్టెంట్‌గా ఉండే సొగసైన క్లాసీ కర్వ్-ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంది. దీని 16జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఈ ఫోన్ నలుపు, తెలుపు రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీని ధర అమెజాన్ లో రూ. 4,743గా ఉంది.

ఐటెల్ ఎస్41.. రూ. 5000లోపు ధరలో కొనుగోలు చేయదగిన మరో ఫోన్ ఐటెల్ ఎస్ 41. ఇది హెచ్ డీ రిజల్యూషన్ లో వస్తుంది. దీనిలో ఏ53ప్రాసెసర్ తో పాటు 3జీబీ ర్యామ్ తో వస్తోంది. ఎల్ఈడీ ఫ్లాష్ తో కూడిన 8ఎంపీ కెమెరా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కాన్ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 4590గా ఉంది.

జియో ఫై జియో ఫోన్ నెక్ట్స్.. దీనిలో 32 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ క్యూఎం 215ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది. నైట్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇది జియో సిమ్ తో మాత్రమే పనిచేస్తుంది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. దీనిలో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్, ట్రాన్స్ లేషన్, రీడ్ లౌడర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..