Praggnanandhaa vs Magnus Carlsen World Cup Chess 2023 Final: ఫిడే ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఫైనల్లో భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానానంద అద్భుత ప్రదర్శన చేశాడు. ఫైనల్లో మాగ్నస్ కార్ల్‌సెన్‌తో తలపడుతోన్న ప్రజ్ఞానానంద అద్భుత ఆటతీరుతో ప్రపంచ నంబర్ వన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో మొదటి క్లాసికల్ గేమ్ మంగళవారం జరిగింది. ఈగేమ్ డ్రాగా ముగిసింది.
భారతదేశానికి చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ అతని కంటే ఎక్కువ అనుభవం, ఉన్నత శ్రేణి ఆటగాడికి వ్యతిరేకంగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 35 కదలికల తర్వాత ప్రత్యర్థిని డ్రాగా ముగించేలా చేశాడు.
🚨 Game 1 of the FIDE World Cup Finals ends in a draw. #Chess #Praggnanandhaa pic.twitter.com/Y2n7tfq3UY
— Indian Tech & Infra (@IndianTechGuide) August 22, 2023
బుధవారం జరిగే రెండు క్లాసికల్ మ్యాచ్‌ల్లోని రెండో గేమ్‌లో కార్ల్‌సన్ తెల్ల పావులతో ఆరంభించి ప్రయోజనకరమైన స్థితిలో ఉంటాడు. సెమీ-ఫైనల్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానాను 3.5-2.5తో ఓడించి ప్రజ్ఞానంద ఫైనల్‌కు చేరాడు.
విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన రెండో భారతీయ ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. అతను 2024లో జరిగే అభ్యర్థుల టోర్నమెంట్‌కు కూడా అర్హత సాధించాడు.
సెమీఫైనల్స్‌లోనూ ప్రజ్ఞానానంద చారిత్రాత్మక విజయం సాధించాడు. రెండు మ్యాచ్‌ల క్లాసికల్ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసిన తర్వాత, 18 ఏళ్ల భారత ఆటగాడు ప్రగ్నానంద థ్రిల్లింగ్ టైబ్రేకర్‌లో దిగ్గజ యూఎస్ గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించాడు. ఇప్పుడు ఫైనల్‌లో నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించి, టైటిల్ నెగ్గాలని కన్నేశాడు.
Here’s a clip of it:)https://t.co/VFAMJp2LCH
— CrowdVerdict (@CrowdVerdict) August 22, 2023
ప్రజ్ఞానానంద్ ఒక భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్. అతను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన చెస్ ఆటగాడిగా పేరుగాంచాడు. అతను కేవలం 10 సంవత్సరాల వయస్సులో ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు. ఆ సమయంలో అలా చేసిన అతి పిన్న వయస్కుడు అతనే. అదే సమయంలో, 12 సంవత్సరాల వయస్సులో, ప్రజ్ఞానంద గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఆ సమయంలో అలా చేసిన రెండో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. బుధవారం జరిగే రెండో గేమ్‌లో మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఢీకొంటాడని భారత చెస్ అభిమానులు ఆశిస్తున్నారు.
Full information : https://t.co/iKB09CUFtp
— Paras | पारस (@chawla_paras) August 22, 2023
Congratulations to R Praggnanandhaa for an outstanding FIDE Chess World Cup journey to the Finals.
My best wishes for the title match against Magnus Carlsen.
More than a billion Indians are cheering for you.🏆🇮🇳 pic.twitter.com/3u9MYHeFqc
— Rahul Gandhi (@RahulGandhi) August 21, 2023
సెమీఫైనల్‌లో విజయం సాధించిన ప్రజ్ఞానానంద్‌ను పలువురు ప్రముఖులు అభినందించారు. ఇందులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. దీంతో పాటు ప్రియాంక గాంధీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ప్రజ్ఞానానంద్ విజయంపై అభినందనలు తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..