Virat Kohli: జులైలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడిగా కోహ్లీ.. లిస్టులో ధోని, రోహిత్ కూడా..

|

Aug 23, 2023 | 12:39 PM

Team India: ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత జట్టులో లేరు. ఐర్లాండ్‌తో భారత జట్టు మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించారు. కాగా, రోహిత్ శర్మతో సహా భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు త్వరలో ఆసియా కప్‌లో కనిపించనున్నారు. ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి జరగనుంది.

Virat Kohli: జులైలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడిగా కోహ్లీ.. లిస్టులో ధోని, రోహిత్ కూడా..
Virat Kohli
Follow us on

Ormax Sports Stars – Most popular sportspersons in India (Jul 2023): భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు.. వెలుపల కూడా ఎంతో పాపులర్ అయ్యాడు. తాజాగా కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. జులై నెలలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. ఓర్మాక్స్ మీడియా ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే.. తొలి రెండు స్థానాల్లో భారత ఆటగాళ్లు ఉన్నారు. విరాట్ కోహ్లి నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు.

ఈ జాబితాలో ఎవరున్నారంటే?

భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోనీలు మొదటి, రెండో స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో మూడో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రికెట్ గాడ్ గా పేరొందిన భారత మాజీ వెటరన్ సచిన్ టెండూల్కర్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్టులో హార్దిక్ పాండ్యా, నీరజ్ చోప్రా కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్‌ పోరుకు సిద్ధమవుతోన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ..

ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత జట్టులో లేరు. ఐర్లాండ్‌తో భారత జట్టు మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించారు. కాగా, రోహిత్ శర్మతో సహా భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు త్వరలో ఆసియా కప్‌లో కనిపించనున్నారు. ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి జరగనుంది. ఈ టోర్నీ మ్యాచ్‌లు పాకిస్థాన్‌తో పాటు శ్రీలంకలో జరగనుండగా, భారత జట్టు మ్యాచ్‌లు శ్రీలంకలో మాత్రమే జరుగుతాయి. ప్రస్తుతం అందరి చూపు భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ పై నెలకొంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి. ఆసియా కప్ లో అత్యధిక టైటిళ్లు గెలిచిన రికార్డ్ టీమిండియాదే కావడం విశేషం.

ఓర్మాక్స్ మీడియా ర్యాంకింగ్స్‌..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..