AFG vs PAK: బుల్లెట్‌లా దూసుకొచ్చిన రాకాసి బౌన్సర్‌.. దెబ్బకు ధారలా కారిన రక్తం.. వీడియో వైరల్‌

|

Mar 28, 2023 | 4:59 PM

మొదటి రెండు మ్యాచుల్లో ఓడిపోయారనే కసితో ఉన్నారేమో ఆఖరి గేమ్‌లో పాక్‌ బౌలర్లు రెచ్చిపోయారు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడమే కాకుండా వరుస బౌన్సర్లతో హడలెత్తించారు. ఈక్రమంలో ఆఫ్గానిస్తాన్‌ బ్యాటర్‌ నజీబుల్లా జద్రాన్‌ పెను ప్రమాదం తప్పింది. పాక్‌ స్పీడ్‌స్టర్‌ ఇహ్సానుల్లా వేసిన ఓ రాకాసి బౌన్సర్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని..

AFG vs PAK: బుల్లెట్‌లా దూసుకొచ్చిన రాకాసి బౌన్సర్‌.. దెబ్బకు ధారలా కారిన రక్తం.. వీడియో వైరల్‌
Najibullah Zadran
Follow us on

షార్జా వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే అంతకుముందు జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ ఆఫ్గాన్‌ గెలవడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా మొదటి రెండు మ్యాచుల్లో ఓడిపోయారనే కసితో ఉన్నారేమో ఆఖరి గేమ్‌లో పాక్‌ బౌలర్లు రెచ్చిపోయారు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడమే కాకుండా వరుస బౌన్సర్లతో హడలెత్తించారు. ఈక్రమంలో ఆఫ్గానిస్తాన్‌ బ్యాటర్‌ నజీబుల్లా జద్రాన్‌ పెను ప్రమాదం తప్పింది. పాక్‌ స్పీడ్‌స్టర్‌ ఇహ్సానుల్లా వేసిన ఓ రాకాసి బౌన్సర్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని జద్రాన్‌ దవడ బాగానికి బలంగా తాకింది. మెరుపు వేగానికి తోడు బంతి బలంగా తాకడంతో రక్తం ధారగా కారింది. దీంతో మైదానంలోనే తీవ్రమైన నొప్పితో విలావిల్లాడిపోయాడు నజీబుల్లా. పరిస్థితిని గమనించిన ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. అయినా నొప్పి తగ్గలేదు. దీంతో జద్రాన్‌ మైదానం విడిచిపెట్టాడు. కాగా జద్రాన్‌ ఎదుర్కొన్న తొలి బంతి కూడా ఇదే కావడం గమనార్హం. దీంతో ఫస్ట్‌ బాల్‌కే రిటైర్డ్ హర్ట్‌ అయి నిరాశగా వెనుదిరిగాడు నజీబుల్లా. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గాయపడిన నజీబుల్లా ప్లేస్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అజ్మతుల్లా ఒమర్జాయ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అజ్మతుల్లా 20 బంతుల్లో 2 పోర్లు, ఒక​ సిక్సర్‌ సాయంతో 21 పరుగులు చేశాడు.

కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్‌ 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. సయీం అయూబ్‌ (40 బంతుల్లో 49), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (25 బంతుల్లో 31) రాణించగా, ఆఖర్లో వచ్చిన కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ (17 బంతుల్లో 28) ధాటిగా ఆడాడు. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్‌ 18.4 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది. అజ్మతుల్లా (21) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పాక్‌ బౌలర్లలో ఇహ్సానుల్లా,షాదాబ్‌ ఖాన్‌ తలా మూడు వికెట్లు సాధించారు. ఇదిలా ఉంటే కాగా ఆఫ్గాన్‌కు పాక్‌పై ఇదే తొలి టీ20 సిరీస్‌ విజయం కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..