ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఐసీసీ టోర్నీకి ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సుమారు పుష్కర కాలం తర్వాత ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోంది. చివరిగా 2011లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది టీమిండియా. దీంతో ఈసారి కూడా హోమ్ అడ్వాంటేజ్‌తో భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని చాలామంది భావిస్తున్నారు. అయితే పిచ్‌ల నిర్వహణలో ఐసీసీ తీసుకున్న కీలక నిర్ణయం వల్ల టీమిండియా ప్రపంచకప్ అవకాశాలకు గండిపడే అవకాశం ఉంది. ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం పిచ్‌ల నిర్వహణపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్‌కప్ జరిగే వేదికల్లో మ్యాచ్‌లు ఏకపక్షంగా కాకుండా, పోటాపోటీగా సాగేలా స్పోర్టింగ్ పిచ్‌లను రూపొందించాలని క్యూరేటర్లను ఆదేశించినట్లు సమాచారం. భారత ఉపఖండంలోని పిచ్‌లు స్పిన్నర్లకు చాలా అనుకూలిస్తాయి. దీనికి తోడు భారత జట్టులో అగ్రశేణి స్పిన్నర్లు ఉన్నారు. వీరు సమర్థంగా రాణిస్తే ప్రపంచకప్‌లో భారత్ విజయం మరింత తేలిక అవుతుంది. అయితే ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయం టీమిండియా వరల్డ్ కప్ ఛాన్సులకు గండిపడే అవకాశముంది. వరల్డ్‌కప్ వేదికల్లో పిచ్‌ల నిర్వహణకు సంబంధించి ఆగస్టు 23న ఐసీసీ సమావేశమంది. ఇందులో ఐసీసీ చీఫ్ క్యూరేటర్ ఆండీ అట్కిన్సన్ పిచ్ క్యూరేటర్లకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచకప్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగేలా స్పోర్టింగ్ వికెట్ పిచ్‌లు తయారుచేయాలని పిచ్ క్యూరేటర్లను ఆదేశించింది ఐసీసీ. వార్మప్ మ్యాచ్‌లు కూడా కాంపిటేటివ్‌గా ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు సమాచారం.
గత మూడు సార్లు ఆతిథ్య జట్లే వన్డే ప్రపంచకప్ టైటిల్స్ గెలిచాయి. 2011లో బంగ్లాదేశ్, శ్రీలంకతో కలిసి భారత్ సంయుక్తంగా ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి జగజ్జేతగా నిలిచింది. ఆ తర్వాత 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో కలిసి మెగా క్రికెట్ టోర్నీని నిర్వహించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఇక చివరిగా 2019లో ఇంగ్లండ్ ఐసీసీ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చి మొదటిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఐసీసీ.. ఆతిథ్య జట్టుకు ప్రయోజనాలు చేకూరకుండా స్పోర్టింగ్ వికెట్‌లు తయారుచేయాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. కాగా అక్టోబర్ 5 నుంచి భారత్‌లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లో జరగనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియా మ్యాచ్‌తో భారత తన ప్రపంచకప్ పోరాటాన్ని ప్రారంభించనుంది.
🔟 mouth-watering clashes 🤩
The schedule for the #CWC23 warm-up fixtures has been released!
More 👉 https://t.co/KdlrmlIelR pic.twitter.com/BVKcH8erWx
— ICC (@ICC) August 23, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..