దేనికైనా రాసి ఉండాలంటారు పెద్దలు. అందులోనూ ఆ భగవంతుడికి సేవ చేసే భాగ్యం రావాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. అదే అదృష్టం గోదావరి జిల్లాల వాసులను వరించింది. భద్రాచలం, ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి గోదావరి జిల్లాల నుంచి తలంబ్రాలు అందిస్తున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద నుండి భద్రాచలానికి, ఒంటిమిట్ట రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు ప్రతి ఏటా పంపుతున్నారు భక్తులు.
రామనామ జపం, రామ గాయత్రీ హోమం అనంతరం అక్షింతలు కుండలో నింపి ఈ పుణ్యక్షేత్రాలకు పంపేందుకు సిద్ధం చేశారు రామ భక్తులు. ఋషులు, హనుమంతుడు, రాముడు వేషధారణలో ప్రత్యేక హోమం నిర్వహించారు. కాగా, కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గత 11 ఏళ్లుగా వరి పంట పండించి భద్రాచలం, అయోధ్య, ఒంటిమిట్టకు తలంబ్రాలు తరలిస్తున్నారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన రామ భక్తులు తమ గోటితో కోటి తలంబ్రాలు వలిచి ఆనవాయితీగా రాములోరి కళ్యాణానికి తలంబ్రాలు తరలిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..