Astro tips : శుక్రవారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తున్నారా? ఈ పొరపాటు చేయకండి.. లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుంది.

| Edited By: Ravi Kiran

Mar 23, 2023 | 9:34 AM

హిందూపురాణాల్లో ఒక్కోరోజు ఒక్కోదేవతకు అంకితం చేయబడింది. అందులో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేశారు. ఈ రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు...ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Astro tips : శుక్రవారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తున్నారా?  ఈ పొరపాటు చేయకండి.. లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుంది.
Astro tips
Follow us on

హిందూ పురాణాల్లో ఒక్కోరోజు ఒక్కోదేవతకు అంకితం చేయబడింది. అందులో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేశారు. ఈ రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు…ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లక్ష్మీదేవిని నిత్యం పూజించినట్లయితే…జీవితంలో ఎప్పుడూ సంపద కొరత, ఆర్థిక నష్టాలు ఉండవని నమ్ముతారు. శుక్రవారం లక్ష్మీదేవితోపాటు శుక్రదేవుడికి అంకితం చేయబడింది. శుక్రదేవుడిని పూజిస్తే ఇంట్లో శ్రేయస్సుతోపాటు ఆనందం లభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారంనాడు కొన్ని పనులు, కొన్ని వస్తువులు కొనుగోలు చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేసినట్లయితే జీవితంలో డబ్బు కొరత ఉండదని..శుక్రదేవుని అనుగ్రహం ఉంటుంది. అయితే శుక్రవారంనాడు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయకూడదో తెలుసుకుందాం.

శుక్రవారం ఏది కొనాలి, ఏది కొనకూడదు:

శుక్రవారం నాడు ఆస్తులకు సంబంధించి ఎలాంటి పనులు కూడా చేపట్టకూడదు. శుక్రవారం ఆస్తిని కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా పరిగణించరు. ఎందుకంటే శుక్రవారం నాడు ఆస్తులు కొనుగోలు చేస్తే..ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు పంపించినట్లవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అతేకాదు వంటగది, పూజాగది సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయకూడదు.

ఇవి కూడా చదవండి

– శుక్రవారం నాడు బట్టలు కొనుగోలు చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తెల్లటి వాహనం కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు.

– కళ, సంగీతం, అలంకరణలు, అందానికి సంబంధించిన వస్తువులను శుక్రవారం కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఈ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది.

శుక్రవారం ఈ పని చేయకండి:

శుక్రవారం డబ్బు లావాదేవీలకు సంబంధించిన కార్యాకలాపాలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడంతో లక్ష్మీదేవికి కోపం వస్తుంది. శుక్రవారం ఎవరికీ పంచదార ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. అంతేకాదు జాతకంలో శుక్రుడి స్థానం బలహీనపడుతుంది. శుక్రవారం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీంతో లక్ష్మీదేవికి సంతోషం, ఆనందం కలుగుతుంది. శుక్రవారం నాడు పొరపాటున కూడా చిరిగిన, మురికి బట్టలు ధరించకూడదు.

శుక్రవారాల్లో ఈ మంత్రాన్ని జపించండి:

ఓం శ్రీ లకీ మహాలక్ష్మీ మహాలక్ష్మీ ఏహ్యేహి సర్వ సభ్యం దేహి మే స్వాహా. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.జపం చేసే సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.

Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..