2 / 5
స్వీడిష్ ఫోరెన్సిక్ కళాకారుడు ఆస్కార్ నీల్సన్ దొరికిన అవశేషాల ఆధారంగా బాలుడి 3డి చిత్రాన్ని సిద్ధం చేశారు. బాలుడి అవశేషాలను జోడించిన తరువాత శరీరంలోని 32 భాగాల కొలతలు తీసుకున్నారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సిద్ధం చేశారు. ఒక వ్యక్తి శరీరం ఎంత కండలు కలిగి ఉండాలనేది అతని జాతి, వయస్సు, లింగం, బరువు ఆధారంగా నిర్ణయించబడుతుంది. అదేవిధంగా అవశేషాల రూపంలో లభించిన అస్థిపంజర విశ్లేషణ ప్రకారం విస్టెగాటన్ చిత్రం తయారు చేశారు.