అభివృద్ధి, సంక్షేమం నిమిత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకుంటుంటాయి. ఇక ఇటీవలే వచ్చిన ప్రపంచ బ్యాంకు రుణ గణాంకాల నివేదికలో పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఈ జాబితాలో భారతదేశంతో సహా అనేక అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలు తమ జీడీపీలో ఎక్కువ భాగాన్ని అప్పుగా కలిగి ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కరోనా కాలంలో, పాకిస్తాన్ DSSI అంటే డెట్ సర్వీస్ సస్పెన్షన్ ఇనిషియేటివ్ (DSSI) పరిధిలోకి వచ్చింది. దీని కారణంగా ఆ దేశానికి విదేశీ రుణాలు పొందడం చాలా కష్టం కావచ్చు. పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఇమ్రాన్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని ప్రపంచ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అమెరికా, చైనా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల పేర్లను కూడా ప్రపంచ బ్యాంక్ రుణగ్రహీత దేశాల్లో చేర్చింది.