New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం ఎలా ఉందో చూశారా..

|

May 27, 2023 | 2:24 PM

పాత పార్లమెంటు భవనం నిర్మించి 100 పూర్తి కావడం, తగినంత మౌలిక సదుపాయాలు లేనందున కొత్త పార్లమెంటు భవనం నిర్మించింది కేంద్రం. కొత్త పార్లమెంట్ భవననికి   డిసెంబర్ 2020లో శంకుస్థాపన జరిగింది.  దశాబ్దాల అనుభవంతో నిష్ణాతుడైన వాస్తుశిల్పి సెంట్రల్ విస్టా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ కొత్త పార్లమెంట్ భవనని డిజైన్ ఇచ్చారు. ఆ విధంగానే నిర్మాణం జరిగింది.

1 / 8
కొత్త పార్లమెంట్ భవనాన్నీ త్రిభుజాకారంలో నిర్మించారు, తద్వారా సరైన స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త భవనాన్ని ప్రస్తుత భవనం కంటే మూడు రేట్లు పెద్దగా నిర్మించారు.

2 / 8
కొత్త లోక్‌సభ భవనం జాతీయ పక్షి 'నెమలి' ఆకృతిలో నిర్మించగా, కొత్త రాజ్యసభ భవనం జాతీయ పుష్పం 'లోటస్' ఆకృతిలో నిర్మించబడింది.

3 / 8
కొత్త పార్లమెంట్ భవనం లోపల కార్యాలయ స్థలాలు అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీతో సౌందర్యపరంగా రూపొందించబడ్డాయి. కార్యాలయ స్థలాలు, కొత్త భవనంలో  అత్యాధునిక ఆడియో-విజువల్ సిస్టమ్‌తో అమర్చారు.

4 / 8
కొత్త పార్లమెంటు భవనం పర్యావరణ అనుకూలమైన ప్లాటినం-రేటెడ్ గ్రీన్ భవనంగా నిర్మించారు. దివ్యాంగులను దృష్టిలో ఉంచుకొని కొత్త పార్లమెంట్ భవనాన్నీ 100 శాతం  వారికి అనుకూలంగా నిర్మించారు.

5 / 8
కొత్త పార్లమెంట్ భవనాన్నీ సుమారు 150 ఏళ్ల జీవితకాలం ఉండేలా భూకంపన్ని కూడా తట్టుకునేలా దృడంగా నిర్మించారు. ఇది భారతదేశంలో ప్రబలంగా ఉన్న ప్రసిద్ధ నిర్మాణ శైలుల సంస్కృతి, శిల్పకళను ప్రతిబింబించేలా ఉంది.

6 / 8
రాబోయే కొన్ని సంవత్సరాల్లో పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి, కొత్త భవనం రాజ్యసభ, లోక్‌సభలో ఎక్కవ సిట్టింగ్ సామర్థ్యం ఉండేలా నిర్మించారు.

7 / 8
కొత్త పార్లమెంట్ భవనం లోక్‌సభలో 888, రాజ్యసభలో 384 మంది సిట్టింగ్ సామర్థ్యం కలిగి ఉంది. కొత్త పార్లమెంటు భవనంలో ఉమ్మడి సమావేశాలు జరిగితే లోక్‌సభలో 1272 మంది సభ్యులు కూర్చునేలా సిట్టింగ్ సామర్థ్యం కలిగి ఉంది.

8 / 8
కొత్త పార్లమెంటు భవనంలోని ఇతర భాగాలలో మంత్రులు, కమిటీల కార్యాలయాలతో నాలుగు అంతస్తులగా నిర్మించారు. కొత్త భవనం ఆధునిక హంగులతో కూడా నూతన లైబ్రరీ కూడా ఉంది.