Best 5G Phones Under 20K: మార్కెట్లో బెస్ట్ 5జీ ఫోన్లు.. కేవలం రూ. 20వేలలోపు ధరలోనే.. స్పెక్స్, ఫీచర్లు ఇవి..

|

Aug 23, 2023 | 5:00 PM

స్మార్ట్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను పెద్ద ఎత్తున మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో 5జీ ట్రెండ్ మార్కెట్ల్ పెరగడంతో అన్ని కంపెనీలు ఆ వేరియంట్లోనే ఫోన్లను తీసుకొస్తున్నాయి. మన దేశంలో వినియోగదారులకు ఫోన్ల ధర చాలా ప్రాధాన్యం. తక్కువ రేంజ్ లో అధికఫీచర్లు ఉండే ఫోన్లను ఇక్కడి ప్రజలు ఇష్టపడతారు. అందుకే కంపెనీలు కూడా లో లెవల్ నుంచి మిడ్ రేంజ్ ధరల్లో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. మీరు ఒకవేళ మంచి 5జీ ఫోన్ మిడ్ రేంజ్ లెవల్ అంటే రూ. 20,000 ధరలో కావాలనుకుంటుంటే ఈ స్టోరీ మీ కోసమే.దీనిలో బెస్ట్ 5జీ పోన్లు రూ. 20000లోపు ధరలోనే ఉండేవి లిస్ట్ చేశాం. రండి అవేంటో చూద్దాం..

1 / 5
శామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జీ.. ఈ ఫోన్ రూ. 20,000లోపు ధరలో బెస్ట్ అని చెప్పొచ్చు. దీనిలో సూప్ అమోల్డ్ 120హెర్జ్ డిస్ ప్లే ఉంటుంది. అలాగే ఎక్సినోస్ 1280 ఎస్ఓసీ చిప్ తో వస్తుంది. 128జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 8ఎంపీ వైడ్ యాంగిల్, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉంటుంది. ఇది 6జీబీ ర్యామ్, 128జీబీ ప్టోరేజ్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 6జీబీ వేరియంట్ ధర రూ. 18,999గా ఉంది.

2 / 5
మోటోరోలా జీ73 5జీ.. దీనిలో 120హెర్జ్ డిస్ ప్లే ఉంటుంది. పెద్ద బ్యాటరీ ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 930 ఎస్ఓసీ చిప్ సెట్ ఉంటుంది. దీని ధర రూ. 18,999గా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది.

3 / 5
వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ.. దీని ధర రూ. 19,999గా ఉంది. దీనిలో ఐపీఎస్ ఎల్సీడీ 120హెర్జ్ డిస్ ప్లే ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్ఓసీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. వెనుకవైపు 108ఎంపీ ప్రెమరీ కెమెరా,  2 ఎంపీ మాక్రో సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999కాగా, 8జీబీ ర్యామ్ 256జీబీ వేరియంట్ ధర రూ. 21,999గా ఉంది.

4 / 5
ఒప్పో ఏ78 5జీ.. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999గా ఉంటుంది. అధిక రిజల్యూషన్ కలిగిన స్కీన్ 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700ఎస్ఓసీ చిప్ ఆధారంగా పనిచేస్తుంది. వెనుక వైపు 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది.

5 / 5
పోకో ఎక్స్5 ప్రో 5జీ..  దీనిలో కూడా 120హెర్జ్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778 ఎస్ఓసీ చిప్ సెట్ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256జీ స్టోరేజ్ ఉంటుంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అయితే12జీబీ వేరియంట్ ధర రూ. 22,999గా ఉంటుంది. అయితే 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రేూ. 20,999గా ఉంది.