Ravi Kiran |
Feb 24, 2021 | 5:03 PM
హైదరాబాద్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభించిన టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్
క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్(CAP)తో ప్రారంభమైన ఈ అకాడమీ బ్యాటింగ్‌లో బెస్ట్ కోచింగ్ ఇవ్వడమే కాకుండా క్రికెట్‌పై పూర్తి అవగాహన పెంచి మంచి ఆటగాళ్లను తయారు చేస్తుంది అని యూసఫ్ పఠాన్ అన్నారు.
ఈ అకాడమీ కోసం త్వరలోనే ఓ మొబైల్ అప్లికేషన్ కూడా ప్రారంభం కానుంది.
హార్మీట్ వాసుదేవ్, ఈ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్.. ఈ ఏడాది చివరి నాటికి జోధ్‌పూర్, కలకత్తా, బిజ్నోర్, గుర్మార్గ్, శ్రీనగర్, పూణే, కోయంబత్తూర్, విశాఖపట్నం, ఆగ్రా, మధుర నగరాలలో ప్రారంభించాలని ప్రణాళికలో ఉన్నారు.