Evening Snacks: ఈవినింగ్ స్నాక్స్‌గా మరమరాల మిక్చర్.. షుగర్ పేషేంట్స్ సహా పిల్లలు పెద్దలకు బెస్ట్ ఆప్షన్.. తయారీ విధానం మీకోసం

|

Aug 22, 2023 | 12:55 PM

ఆకలి వేస్తే చాలా మంది బిస్కెట్స్ ను తింటారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ టీ తో పాటు.. స్నాక్స్ గా  బిస్కెట్స్ ను తిని హమ్మయ్య అనుకుంటారు. అయితే ఈ బిస్కెట్లలో పిండి, చక్కెర ఉంటాయి. ఆకలి అనిపించినప్పుడల్లా ఇలా బిస్కెట్లు తినడం శరీరానికి మంచిది కాదు. ఎక్కువగా బిస్కెట్స్ తినడం  మలబద్దకానికి కూడా కారణమవుతుంది. కనుక మధ్యాహ్నం టీతో బిస్కెట్లు తీసుకునే బదులు ఈజీగా మరమరాలతో స్నాక్స్ చేసుకుని తినవచ్చు. ఇవి ఆకలిని తీరుస్తాయి.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి.. 

1 / 6
చిన్న పెద్ద అనే తేడా లేకుండా మరమరాలను తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో  మంచి స్నాక్స్ ఐటెమ్స్ చేసుకోవచ్చు.  వాటిల్లో ఒకటి మరమరాలు మసాలా మిక్చర్.. 

2 / 6
తయారీకి కావాల్సిన పదార్ధాలు: మ‌ర‌మ‌రాలు, నూనె, ప‌సుపు, ప‌ల్లీలు, క‌రివేపాకు, కారం, ఉప్పు, వేయించిన జీల‌క‌ర్ర పొడి, నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కొత్తిమీర,

3 / 6
త‌యారీ విధానం: బాణలిలో నూనె వేసి వేడయ్యాక.. పసుపు వేయండి.. తర్వాత మరమరాలు వేసి బాగా మిక్స్ చేసి.. నూనె వేసి వేయించి గిన్నెలోకి తీసుకుని తర్వాత బాణలిలో నూనెవేసి పల్లీలు వేసి వేయించాలి.

4 / 6
అందులోనే కరివేపాకు వేసి వేయించి మరమరాలు వేసుకున్న గిన్నెలో వేసి కలపాలి.. అందులో జీలకర్ర పొడి.. కొంచెం మసాలా వేసుకుని కలిపి..ఉల్లిపాయ ముక్కలు వేసి నిమ్మరసం పిండాలి.. అంతే  టేస్టీ టేస్టీ మరమరాలు మిక్చర్ రెడీ. 

5 / 6

ఈ  స్నాక్స్ సాయంత్రంతో పాటు, ప్ర‌యాణాలు చేసే సమయంలో బెస్ట్ ఆప్షన్.. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.   

6 / 6
మరమరాల మిక్చర్ చాలా తేలిగ్గా అరగడంతో పాటు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మరమరాల్లోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ వల్ల రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది. ఈ స్నాక్ ఐటెం డయా బెటీస్‌ వ్యాధిగ్రస్తులకూ మంచి ఫుడ్. 