Tamil Films: తమిళ సినిమాలకు 1000 కోట్లు ఎప్పటికీ కలగానే ఉండబోతుందా..?

|

Aug 24, 2023 | 5:03 PM

తెలుగు, కన్నడ సినిమాలకు మాత్రమే 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఉందా..? ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్స్ అయినా.. తమిళ సినిమాలకు మాత్రం 1000 కోట్లు ఎప్పటికీ కలగానే ఉండబోతుందా..? జైలర్, విక్రమ్, పొన్నియన్ సెల్వన్ అంత పెద్ద హిట్టైనా.. 400, 500 కోట్ల దగ్గరే ఆగిపోడానికి కారణమేంటి.. అన్ని విషయాల్లో బాగానే ఉన్నా.. ఆ ఒక్క విషయంలో తమిళ సినిమాలు ఫెయిలవుతున్నాయా..?

1 / 6

2 / 6
ఎందుకు తమిళ సినిమాలు 1000 కోట్ల వైపు వెళ్లట్లేదు.. ఈ అనుమానం నిజంగానే చాలా మంది ఆడియన్స్‌కు కూడా వచ్చుంటుంది. తెలుగు, కన్నడ సినిమాలకు సాధ్యమైన రికార్డ్.. కోలీవుడ్‌కు ఒక్కటే ఎందుకు సాధ్యం కావట్లేదు..?

3 / 6
సింగిల్ లాంగ్వేజ్‌లో 400 కోట్లు కొడుతున్న సినిమాలు.. 1000 కోట్లు వసూలు చేయకపోవడానికి కారణమేంటని అంతా ఆరా తీస్తున్నారు.. దానికి రీజన్ హిందీ మార్కెట్ లేకపోవడమే.

4 / 6
తమిళ సినిమాలను కేవలం అక్కడి ఆడియన్స్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఈ విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి.. ఇందులో నిజం లేకపోలేదు.

5 / 6
పొన్నియన్ సెల్వన్ 1 అండ్ 2 కలిపి 700 కోట్లు వసూలు చేసాయి. కానీ ప్యూర్ తమిళ వాసనలున్నందుకే అక్కడ తప్ప మిగిలిన అన్నిచోట్లా అది ఫ్లాప్ అయింది. అందుకే 1000 కోట్లకు దూరంగా ఆగిపోయింది.

6 / 6
ఎక్కడి వరకో ఎందుకు.. జైలర్ కూడా హిందీ బెల్ట్‌లో ప్రభావం చూపించలేకపోతుంది. అందుకే 1000 కోట్లు దీనికి దూరమయ్యాయి. గతేడాది కమల్ హాసన్ విక్రమ్ సినిమాకు ఇదే సమస్య. విజయ్ సినిమాలకు ఇదొక్కటే మైనస్. బాహుబలి, ట్రిపుల్ ఆర్, కేజియఫ్ 2 1000 కోట్లు వసూలు చేయడానికి హిందీ మార్కెట్ కారణం. తమిళ సినిమాలకు అది లేకపోవడమే వాళ్లను 1000 కోట్లకు దూరం చేస్తుంది.