టాటా టియాగో @ 10,695 యూనిట్లు.. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది టాటా టియాగో. దీని ధర రూ. 9.19లక్షల నుంచి ప్రారంభమై రూ. 12.78లక్షల వరకూ ఉంది. దీనిలో 7.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-స్పీకర్ హర్మాన్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. 19.2kWh, 24kWh బ్యాటరీ సామర్థ్యాలతో ఇది అందుబాటులో ఉంది. 2023రెండో క్వార్టర్‌లో ఇప్పటి వరకూ 10,695 యూనిట్లు అమ్ముడయ్యాయి.