ఆప్‌ ఎంపీతో నటి డేటింగ్‌.. ఎంగేజ్‌మెంట్ డేట్‌ కూడా ఫిక్స్‌..?

|

Apr 07, 2023 | 8:36 AM

1 / 5
బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా డేటింగ్‌ రూమర్స్‌ సోషల్‌ మీడియాను గత కొంతకాలంగా హీటెక్కిస్తున్నాయి. ఇక తాజాగా ఆమె త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

2 / 5
బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం పట్టాలెక్కనుంది. వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో డిన్నర్, లంచ్ అంటూ చట్టాపట్టాలేసుకు తిరుగుతూ మీడియా కంట పడినా.. అబ్బే అదేం లేదంటూ కొట్టిపారేశారు.

3 / 5
ఢిల్లీ వేదికగా ఈ ప్రేమజంట ఈ నెల 13న నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు సమాచారం. వీరి పెళ్లి అక్టోబ‌ర్‌లో జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చర్చించుకుంటున్నాయి.

4 / 5
పరిణీతి-రాఘవ్‌ల ఎంగేజ్‌మెంట్‌కు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. నిశ్చితార్థ వేడుకలో ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్‌దేవా రూపొందించిన డిజైనర్‌ డ్రెస్‌లో కనిపించనుండగా, పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా స్పెషల్‌గా డిజైన్‌ చేసిన భారత తీయ సంప్రదాయ వస్త్రాల్లో కనిపించనుంది. పరిణీతి డిజైనర్‌తో కలిసి చాలాసార్లు కనిపించింది కూడా. దీంతో రాఘవ్‌తో ఆమె పెళ్లి పుకార్ల మరింత బలం చేకూర్చినట్లైంది.

5 / 5
ఇక దీనిపై పరిణీతి-రాఘవ్ చద్దా అధికారికంగా ధృవీకరించనప్పటికీ వీరి పెళ్లి వార్తలు మాత్రం నానాటికి ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం ప‌రిణీతి చోప్రా సినిమాలతో బిజీగా ఉంది. ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నందువల్ల పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.