Umesh Pal Murder Case: తీవ్ర ఉత్కంఠ మధ్య యూపీకి చేరిన మాఫియా డాన్‌ కాన్వాయ్‌.. ఎన్‌కౌంటర్‌ చేస్తారని భయపడుతున్న అతిఖ్‌

|

Mar 27, 2023 | 9:05 PM

యూపీ మాఫియాడాన్‌కు గట్టి భద్రత మధ్య గుజరాత్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు. కిడ్నాప్‌ కేసులో కోర్టులో ఆయన్ను హాజరుపర్చారు. అయితే తనను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తారని ప్రాణభయంతో వణికిపోతున్నాడు అతిఖ్‌ అహ్మద్‌.

Umesh Pal Murder Case: తీవ్ర ఉత్కంఠ మధ్య యూపీకి చేరిన మాఫియా డాన్‌ కాన్వాయ్‌.. ఎన్‌కౌంటర్‌ చేస్తారని భయపడుతున్న అతిఖ్‌
Atique Ahmed
Follow us on

క్షణక్షణం ఎన్‌కౌంటర్‌ భయం మధ్య యూపీ మాఫియాడాన్‌ అతిఖ్‌ అహ్మద్‌ను గుజరాత్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు. 2019 నుంచి గుజరాత్‌ జైల్లో ఉన్న అతిఖ్‌ అహ్మద్‌ను కిడ్నాపింగ్‌ కేసులో ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకొచ్చారు. అయితే పోలీసులు తనను ఎన్‌కౌంటర్‌ చేస్తారని వణికిపోతున్నాడు అతిఖ్‌అహ్మద్‌. బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజ్‌పాల్‌ మర్డర్‌తో పాటు ఈ కేసులో సాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ మర్డర్‌ కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు అతిఖ్‌ అహ్మద్‌. అయితే అతిఖ్‌ అహ్మద్‌ తరలింపులో హైడ్రామా చేసుకుంటోంది. పోలీసు కాన్వాయ్‌ ఆగినప్పుడల్లా పోలీసులు తనను ఎన్‌కౌంటర్‌ చేస్తారన్న భయం అతిఖ్‌ అహ్మద్‌ను వెంటాడింది. అతిఖ్‌ అహ్మద్‌పై యూపీలో 100 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

తీవ్ర ఉత్కంఠ మధ్య అతిఖ్‌ అహ్మద్‌ కాన్వాయ్‌ ఉత్తరప్రదేశ్‌కు చేరుకుంది. కాన్వాయ్‌ను మీడియా సిబ్బందితో పాటు అతిఖ్‌ అహ్మద్‌ బంధువులు కూడా కార్లలో ఫాలో అయ్యారు. తనన పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తారని ఆరోపించారు అతిఖ్‌ అహ్మద్‌. అతిక్‌ అహ్మద్‌ సెక్యూరిటీపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. తనకు ప్రాణభయం ఉందని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

సబర్మతి నుంచి నైనీ జైలుకు వెళ్లే మార్గంలో యూపీ పోలీసు కాన్వాయ్ మొత్తం 11 సార్లు ఆగింది. దారిలో యూపీ పోలీసుల కాన్వాయ్ ఆగినప్పుడల్లా.. అప్పుడప్పుడూ అతిక్ ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. అతిక్‌తో వెళ్తున్న UP పోలీసు కాన్వాయ్ ఏ 11 ప్రదేశాలలో ఆగినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం