Dupatta: ఆమె ధరించిన చున్నీ యమపాశమైంది.. గుడికి వెళ్తుండగా బైక్‌ చక్రాల్లో చిక్కుకుని రెప్పపాటులో..

|

Aug 23, 2023 | 11:35 AM

ముంబాయిలోని వాసాయి ప్రాంతంలోని తుంగరేశ్వర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న తప్పిదంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రతిమ యాదవ్ (27) అనే మహిళ తన భర్త మనీష్ యాదవ్‌తో కలిసి కందివాలి నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ బైక్‌పై వాసాయ్‌లోని తుంగరేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించడానికి బయల్దేరింది. ఆమె ధరించిన చున్నీ (దుపట్టా) వెనుక వైపు వేలాడుతూ ఉంది. అది దంపతులిరువురూ గమనించలేదు. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో వెనుక చక్రంలో ప్రతిమ చున్నీ..

Dupatta: ఆమె ధరించిన చున్నీ యమపాశమైంది.. గుడికి వెళ్తుండగా బైక్‌ చక్రాల్లో చిక్కుకుని రెప్పపాటులో..
Dupatta Gets Entangled In Rear Wheel Of Bike
Follow us on

ముంబై, ఆగస్టు 23: మృత్యువు ఏ రూపంలో ఎటువైపు నుంచి దాడి చేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. చిన్నపాటి నిర్లక్ష్యం వెలకట్టలేని నష్టానికి దారి తీస్తుంది. తాజాగా ఓ మహిళ బైక్‌పై భర్తతో పాటు ప్రయాణిస్తుండగా చున్నీ చక్రాల్లో చిక్కుకోవడంతో రోడ్డుపై జారిపడి మృతి చెందింది. ఈ ఘటనలో మహిళ చున్నీ మెడకు బిగుతుగా చుట్టుకోవడంతో అదే ఉరితాడే ప్రాణాలను హరించింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన ముంబాయిలో ఆదివారం (ఆగస్టు 20) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ముంబాయిలోని వాసాయి ప్రాంతంలోని తుంగరేశ్వర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న తప్పిదంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రతిమ యాదవ్ (27) అనే మహిళ తన భర్త మనీష్ యాదవ్‌తో కలిసి కందివాలి నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ బైక్‌పై వాసాయ్‌లోని తుంగరేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించడానికి బయల్దేరింది. ఆమె ధరించిన చున్నీ (దుపట్టా) వెనుక వైపు వేలాడుతూ ఉంది. అది దంపతులిరువురూ గమనించలేదు. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో వెనుక చక్రంలో ప్రతిమ చున్నీ చిక్కుకుంది. దీంతో చున్నీ మెడకు చుట్టుకుపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు చున్నీ మెడకు బిగుసుకోవడంతో ఆమె బైక్‌పై నుంచి రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయం తగిలింది. బాధితురాలిని హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించేలోపు దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అంతా క్షణాల్లో కనురెప్పపాటులో జరిగిపోయింది. తన పక్కనే ఉన్నా భార్యను కాపాడుకోలేకపోయానని భర్త కన్నీరుమున్నీరుగా విలపించాడు. చిన్న వయసులోనే మృతి చెందిన ప్రతిమా యాదవ్ అకాల మరణం కందివలి వాసులను శోకసంద్రంలో ముంచెత్తింది.

దంపతులు ఇరానివాడి ప్రాంతంలోని ఠాకూర్ చాల్‌లో నివాసం ఉండేవారు. ఆదివారం దేవుడిని దర్శించుకోవడానికి ఈ జంట బయల్దేరింది. ముంబై-అహ్మదాబాద్ హైవేపై వసాయ్ బఫనే సమీపంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

తుపాకీ మిస్‌ఫైర్‌ అయ్యి హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

హైదరాబాద్‌లోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో కబుతర్ఖాన ప్రాంతంలో ప్రమాదవశాత్తు చేతిలోని తుపాకీ మిస్ ఫైర్‌ అయ్యి భూపతి శ్రీకాంత్‌ అనే హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. నిన్న రాత్రి (మంగళవారం) విధులు ముగించుకుని నిద్రించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భూపతి శ్రీకాంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా అసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.