Tollywood: ఒకప్పటి ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? చిరంజీవి, మహేశ్‌, ఎన్టీఆర్‌లతో సినిమాలు చేసిందండోయ్‌

|

Apr 02, 2023 | 5:50 AM

పెళ్లయ్యాక మహిళల జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అవి శారీరకంగానూ, మానసికంగానూ ఉంటాయ్‌. ముఖ్యంగా అమ్మాయ్యాక ఆడవాళ్ల శరీరంలో చాలా ఛేంజెస్‌ వస్తాయి. థైరాయిడ్‌ సమస్యలు, హర్మోన్ల అసమతుల్యత కారణంగా చాలా బొద్దుగా మారిపోతారు. అందుకు సెలబ్రిటీలేమీ అతీతులు కాదు.

Tollywood: ఒకప్పటి ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? చిరంజీవి, మహేశ్‌, ఎన్టీఆర్‌లతో సినిమాలు చేసిందండోయ్‌
Actress
Follow us on

పెళ్లయ్యాక మహిళల జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అవి శారీరకంగానూ, మానసికంగానూ ఉంటాయ్‌. ముఖ్యంగా అమ్మాయ్యాక ఆడవాళ్ల శరీరంలో చాలా ఛేంజెస్‌ వస్తాయి. థైరాయిడ్‌ సమస్యలు, హర్మోన్ల అసమతుల్యత కారణంగా చాలా బొద్దుగా మారిపోతారు. అందుకు సెలబ్రిటీలేమీ అతీతులు కాదు. పై ఫొటోలో బొద్దుగా కనిపిస్తున్నామె ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌. మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్‌, మాస్‌ మహారాజా రవితేజ, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అక్కినేని నాగార్జున లాంటి స్టార్‌ హీరోలతో కలిసి నటించింది. అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాదు కన్నడ, తమిళ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. అయితే సినిమా కెరీర్‌ పీక్‌ స్టేజిలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే థైరాయిడ్‌ సమస్య కారణంగా చాలా బొద్దుగా మారిపోయింది. అందుకే తెలుగు ప్రేక్షకులు ఆమెను త్వరగా గుర్తుపట్టలేపోతున్నారు. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. ‘చంటీ… ఐ లవ్యూ రా’ అనే ట్రేడ్‌ మార్క్ డైలాగ్‌తో ఇడియట్‌ సినిమాలో రవితేజను వెంట తిప్పించుకున్న రక్షిత.

మహేశ్‌తో నిజం, నాగార్జునతో శివమణి, ఎన్టీఆర్‌తో ఆంధ్రావాలా, చిరంజీవితో అందరివాడు, వేణుతో పెళ్లాం ఊరేళితే, జగపతిబాబుతో జగపతి వంటి సినిమాల్లో నటించింది రక్షిత. అయితే 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమైంది. అప్పుడప్పుడు కొన్ని బుల్లితెర షోల్లో కనిపిస్తూ సందడి చేస్తోంది. అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో తన ఫొటోలు షేర్‌ చేస్తోంది. అయితే ఆ ఫొటోలు చూసిన జనాలు త్వరగా ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. కారణం అందులో ఆమె చాలా బొద్దుగా కనిపించడమే. అయితే రక్షిత అలా బొద్దుగా మారిపోవడానికి కారణం థైరాయిడేనని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి