ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నోట వినిపిస్తోన్న సినిమా బలగం. థియేటర్లలో సూపర్‌డూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో సినిమా చూసిన చాలామంది బలగంపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కుటుంబ బంధాలు, బాంధవ్యాలను చాలా అద్భుతంగా చూపించారంటూ, సినిమాను చూసి కన్నీళ్లు పెట్టుకున్నామంటూ బలగం యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా డైరెక్టర్ వేణు అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు బలగం యూనిట్‌ను మెచ్చుకున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి బలగం యూనిట్‌ను ప్రశంసించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారంటూ వేణును అభినందించారు. తాజాగా సిరిసిల్ల కలెక్టరేట్‌లో జరిగిన ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వేణును కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేణును మంత్రి కేటీఆర్ ఆలింగనం చేసుకుని, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలను చక్కగా చూపించారని వేణును కేటీఆర్ అభినందించారు. సమాజానికి దోహదపడేలా బలగం లాంటి సినిమాలు మరిన్ని తీయాలని సూచించారు. కాగా దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన బలగం సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా మార్చి 3న విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీలోకి వచ్చేసింది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ అందుకుంటూ ట్రెండింగ్ లిస్టు టాప్-2లో నిలిచింది.
Thank you so much @KTRBRS garu ??
Love you, Ramana??
for the way you are encouraging talent? #balagam #sircilla #trs #BRS #venuyeldandi @DilRajuProdctns @priyadarshi_i @LyricsShyam @vamsikaka @KavyaKalyanram pic.twitter.com/Ek21pQAlnO— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) March 27, 2023
Moments to cherish ?
Minister @KTRBRS felicitated our director @VenuYeldandi9, for the phenomenal success of #Balagam ?❤️
Running successfully in theatres near you?@priyadarshi_i @kavyakalyanram @dopvenu @LyricsShyam@DilRajuProdctns @HR_3555 #HanshithaReddy @vamsikaka pic.twitter.com/oUGCEVFQ7F
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) March 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..