ఎన్టీఆర్ సతీమణి ప్రణతి బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రణితితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే అమ్మలు అంటూ తన ప్రేమను తెలియజేశారు తారక్. ఇది చూసిన నందమూరి అభిమానులు ప్రణతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తారక్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండరు. అప్పుడప్పుడు సినిమా అప్డేస్ మాత్రమే పోస్ట్ చేస్తుంటారు. ఇక తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు.. పిల్లలతో కలిసి ఉన్న పిక్స్ చాలా అరుదుగా పోస్ట్ చేస్తుంటారు తారక్. ఈ క్రమంలో తన భార్య ప్రణతికి బర్త్ డే విషెస్ చెబుతూ తనతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు తారక్.
అలాగే ఇటీవల బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. తారక్ కుటుంబానికి సర్పైజ్ ఇచ్చింది. ఎన్టీఆర్ పిల్లలు నందమూరి అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు తన బ్రాండ్ కాన్షియస్ క్లాతింగ్ నుంచి దుస్తులను పంపించింది. యూ ఆర్ పై ఫేవరేట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్ లో ప్యాక్ చేసి.. అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లతో చెరో బ్యాక్ కు ట్యాగ్స్ పెట్టి పంపించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా షేర్ చేసుకున్నారు తారక్. ఈ సందర్భంగా అలియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ థ్యాంక్స్ అలియా.. నీ క్లాతింగ్ బ్రాండ్ ఎప్పుడూ అభయ్ రామ్, భార్గవ్ రామ్ ముఖాల్లో సంతోషాన్ని ఉంచుతుంది. నా పేరు మీద కూడా ఒక బ్యాగ్ చూడాలనుకుంటున్నా’ అని తెలిపాడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ NTR30 ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుంది. అలాగే సీనియర్ హీరో శ్రీకాంత్ సైతం ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.