తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు సునీల్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని కమెడియన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హీరోగా సినీ ప్రియులను అలరించారు. హీరోగా కొన్నాళ్లపాటు కెరీర్ బాగానే సాగినా.. తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా మారారు. ఇక ఇప్పుడిప్పుడే విలన్ పాత్రలలో మెప్పిస్తున్నారు సునీల్. ప్రస్తుతం స్టార్ హీరోస్ సినిమాల్లో కీలకపాత్రలలో నటిస్తున్నారు. అయితే నటుడిగా తన నటనతో ప్రేక్షకులను దగ్గరయిన సునీల్.. వ్యక్తిగత విషయాలు మాత్రం అంతగా మీడియా ముందుకు రావు. సునీల్ ఎప్పుడు తన భార్య పిల్లల్ని మీడియా ముందుకు తీసుకువచ్చింది లేదు. ఆయన హీరోగా కొనసాగిన సమయంలోనూ ఈ వేడుకలలో సునీల్ కుటుంబసభ్యులు హాజరు కాలేదు.
కానీ సునీల్ కుటుంబసభ్యుల గురించి తెలుసుకోవడానికి మాత్రం నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొ్న్న తన పిల్లల గురించి మాట్లాడారు. సునీల్ కు ఇద్దరు పిల్లలు. పాప పేరు కావ్య కుందన. పదవ తరగతి పూర్తి చేసింది. ఇప్పుడే కాలేజీలోకి ఎంటర్ అవుతుందన్నారు. ఇక బాబు ఆరవ తరగతి చదువుతున్నాడట.
అయితే పిల్లల్ని సినిమాల్లోకి తీసుకొస్తారా ? అని అడిగితే అది నా చేతుల్లో లేదు. వాళ్ల లైఫ్ ఎలా డిసైడ్ చేసుకుంటే అలా ముందుకెళ్తారు అని అన్నారు. ఇక తన భార్య పేరు శ్రుతి అని.. తను ఇంట్లోనే ఉంటుందని.. అన్నారు. ఎప్పుడూ తాను తన బిజీలో ఉంటానని.. సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తానని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.