BRO Movie Review: ‘బ్రో’ మూవీ రివ్యూ.. పవన్, తేజ్ కలిసి అదరగొట్టేసారా ?..

| Edited By: Rajitha Chanti

Jul 28, 2023 | 12:24 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా..? అలాగే మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఆయన నటించిన మొదటి సినిమా ఇది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. బ్రో ఆకట్టుకుందా..? దేవుడిగా పవన్ కళ్యాణ్ మరోసారి మెప్పించారా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

BRO Movie Review: బ్రో మూవీ రివ్యూ.. పవన్, తేజ్ కలిసి అదరగొట్టేసారా ?..
Bro Movie Review
Follow us on

మూవీ రివ్యూ: బ్రో

నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, రోహిణి, వెన్నెల కిషోర్ తదితరులు

సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్

ఇవి కూడా చదవండి

ఎడిటర్: నవీన్ నూలి

సంగీతం: థమన్

స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్

నిర్మాత: టిజి విశ్వప్రసాద్

దర్శకుడు: సముద్రఖని

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా..? అలాగే మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఆయన నటించిన మొదటి సినిమా ఇది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. బ్రో ఆకట్టుకుందా..? దేవుడిగా పవన్ కళ్యాణ్ మరోసారి మెప్పించారా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

మార్కండేయులు (సాయి ధరమ్ తేజ్) ఓ టెక్స్ టైల్ కంపెనీలో జాబ్ చేస్తుంటారు. కుటుంబ భారం అంతా ఆయనపైనే ఉంటుంది. చిన్నపుడే తండ్రి చనిపోవడంతో అమ్మ (రోహిణి), చెల్లెల్లు (ప్రియా ప్రకాశ్ వారియర్)లను దగ్గరుండి చూసుకుంటాడు.. వాళ్లకు కావాల్సినవన్నీ నాన్నలా ఇస్తుంటాడు. మార్క్‌కు ఓ గాళ్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. తన పేరు రమ్య (కేతిక శర్మ). అన్నీ బాగున్నాయి.. లైఫ్‌లో బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న సమయంలో తన పుట్టిన రోజు నాడే యాక్సిడెంట్‌లో చనిపోతాడు. అప్పుడు మార్క్ జీవితంలోకి వస్తాడు టైమ్ (పవన్ కళ్యాణ్). తనకు అప్పుడే చనిపోవాలని లేదని.. తనకు ఇంకాస్త టైమ్ కావాలని అడుగుతాడు మార్క్. అప్పుడు టైమ్ మార్క్‌కు మరో ఛాన్స్ ఇస్తాడు. అప్పుడేమైంది.. అసలు మార్క్ మళ్లీ బతికిన తర్వాత ఏం చేసాడు అనేది అసలు కథ..

కథనం:

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎలా ఉండాలి.. పాటలు కావాలా.. ఓకే ఉన్నాయి. డాన్సులు కావాలా ఓ ఊపేయకపోయినా పర్లేదు సర్దుకోవచ్చు. కామెడీ కావాలా నవ్వుకోవచ్చు.. ఫ్యామిలీ ఎమోషన్స్ ఓకే. మంచి కథ కూడా ఉంది.. బ్రో సినిమాలో అన్నీ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇంతకంటే ఏం కావాలి..? సముద్రఖని కూడా ఇదే లెక్కలేసుకుని మరీ బ్రో సినిమా తీసినట్లు అనిపిస్తుంది. దానికి త్రివిక్రమ్ కూడా తోడు కావడంతో ఫ్యామిలీ సినిమా ఒకటి బయటికి వచ్చింది. పవన్ లాంటి స్టార్ హీరోతో చేయాల్సిన సబ్జెక్ట్ అయితే ఇది కాదు.. ఆయన నుంచి ఫ్యాన్స్ కోరుకునే అంశాలు బ్రోలో ఉన్నాయి కానీ కామన్ ఆడియన్స్ కోరుకునే విషయాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే బ్రో సగటు సినిమాగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువ. అయితే ఫ్యాన్స్‌కు మాత్రం విందు భోజనం పెట్టేసాడు సముద్రఖని. సినిమాలో ఆయన పాత్ర టైమ్ కావడంతో హద్దులు లేకుండా రెచ్చిపోయాడు పవన్. తన పాత పాటలకు ఆయన చిన్నపిల్లాడిలా స్టెప్పులేస్తుంటే మురిసిపోయారు ఫ్యాన్స్. నేను టైమ్ అంటూ వేదాంతం చెబుతుంటే నిజమేగా అనిపిస్తుంది. అభిమానులకు బ్రో బాగానే ఫుల్ మీల్స్ పెడుతుంది. కామన్ ఆడియన్‌కు మాత్రం అక్కడక్కడా లోపాలు కనిపించాయి.. ముఖ్యంగా ఫస్టాఫ్ ఆర్టిఫిషియల్ గా ఉంది. టైం లేదు టైం లేదు అని తేజ్ అంటుంటాడు.. నిజంగానే ఆ టైం లేక చుట్టేసినట్టు అనిపించింది. సెకండాఫ్ మాత్రం ఆకట్టుకుంటుంది.. ఎమోషన్స్ కూడా పర్ఫెక్ట్ గా పండాయి.. పవన్, తేజ్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. మామ అల్లుళ్ళ మధ్య వచ్చే సీన్స్.. తేజ్ ను పవన్ ఆటపట్టించే తీరు బాగుంది. ఇది సినిమా కాదు.. సింపుల్ గా లైఫ్ థియరీ. నువ్వున్నా లేకపోయినా జరిగేది జరగక మానదు.. రేపు ఏదో అయిపోతుంది అని బాధపడకు.. ఇప్పుడు ఉన్న టైం ఎంజాయ్ చెయ్ అనేది చెప్పాడు సముద్రఖని. చివర్లో ఫ్యామిలీ సన్నివేశాలు బాగానే వర్కవట్ అయ్యాయి.

నటీనటులు:

టైమ్ పాత్రలో పవన్ కళ్యాణ్ రఫ్పాడించాడు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్.. కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఫస్ట్ 10 నిమిషాలు మినహాయిస్తే సినిమా అంతా ఉన్నాడు పవన్. ముఖ్యంగా పాత పాటలకు గెటప్స్ అదిరాయి. సాయి ధరమ్ తేజ్ మరోసారి ఆకట్టుకున్నాడు. యాక్సిడెంట్ నుంచి బతికి బయటపడ్డాడు కాబట్టి ఈ క్యారెక్టర్ ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. కేతిక శర్మ పర్లేదు.. ఉన్నంతలో బాగానే చేసింది. అలాగే ప్రియా వారియర్ ఈ సినిమాలో చెల్లి పాత్రలో నటించింది. రోహిణి తల్లి పాత్రకు న్యాయం చేసారు. వెన్నెల కిషోర్, రాజా, తణికెళ్ల భరణి అంతా ఓకే. మిగిలిన వాళ్లంతా తమ పాత్రల్లో మెప్పించారు.

టెక్నికల్ టీం:

తమన్ పాటలు బాలేవు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ముఖ్యంగా టైమ్‌పై వచ్చే పాట బాగుంది. దానికి ఆర్ఆర్ కూడా అదిరింది. పవన్ వచ్చినప్పుడల్లా బ్యాగ్రౌండ్ స్కోర్ చంపేసాడు థమన్. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. అలాగే ఎడిటింగ్ కూడా సూపర్. చాలా క్రిస్పీగా సినిమాను కట్ చేసాడు నవీన్ నూలి. దర్శకుడిగా సముద్రఖని మంచి లైన్ తీసుకున్నాడు. జీవితం అంటే ఏంటో అంటూ అంతా పరిగెడుతూ ఉంటారు.. ఈ మాయలో పడి ఇప్పుడున్న క్షణాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇదే సినిమాలో చూపించాడు సముద్రఖని. దానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సరిపోయాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా బ్రో.. భారీ అంచనాలు లేకుండా వెళ్తే ఇట్స్ ఓకే బ్రో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.