Adipurush Movie Rreview: ఆదిపురుష్ మూవీ ఫుల్ రివ్యూ.. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే

| Edited By: Rajeev Rayala

Jun 16, 2023 | 12:08 PM

ఆదిపురుష్.. కొన్ని రోజులుగా ఇండియన్ సినిమాలో దీని గురించి చర్చ బాగా జరుగుతుంది. ప్రభాస్ నటించిన ఈ మోడరన్ రామాయణం ఈ జనరేషన్ కు నచ్చిందా లేదా.. అసలు ఈ సినిమా ఎలా ఉంది పూర్తి రివ్యూలో చూద్దాం..

Adipurush Movie Rreview: ఆదిపురుష్ మూవీ ఫుల్ రివ్యూ.. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే
Adipurush
Follow us on

రివ్యూ: ఆదిపురుష్

నటీనటులు : ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త, సోనాల్ చౌహన్ తదితరులు

మూలకథ : వాల్మీకి రాసిన రామాయణం

మాటలు : భీమ్ శ్రీనివాస్ (తెలుగులో)

పాటలు : రామజోగయ్య శాస్త్రి

సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ పళని

నేపథ్య సంగీతం : సంచిత్ – అంకిత్

సంగీతం : అజయ్ – అతుల్, సచేత్ – పరంపర!

నిర్మాతలు : భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్, రాజేష్ నాయర్, ప్రసాద్ సుతార

డిస్ట్రిబ్యూషన్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (తెలుగులో)

దర్శకత్వం : ఓం రౌత్

ఆదిపురుష్.. కొన్ని రోజులుగా ఇండియన్ సినిమాలో దీని గురించి చర్చ బాగా జరుగుతుంది. ప్రభాస్ నటించిన ఈ మోడరన్ రామాయణం ఈ జనరేషన్ కు నచ్చిందా లేదా.. అసలు ఈ సినిమా ఎలా ఉంది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:
తండ్రి కోరిక మేరకు రాముడు (ప్రభాస్) జానకి (కృతి సనన్), లక్ష్మణ (సన్నీ సింగ్) సమేతంగా 14 సంవత్సరాల వనవాసానికి బయలుదేరుతాడు. వాళ్లు అడవుల్లో ఉండగా ఒక రోజు సూర్పనక మాటలు నమ్మి రావణుడు (సైఫ్ అలీ ఖాన్) సీతమ్మను అపహరిస్తాడు. ఆ తర్వాత ఆంజనేయుడు (దేవదథ్), సుగ్రీవుడు మిగిలిన వానర సైన్యంతో లంకపై దండెత్తి రాముడు సీతను ఎలా వెనక్కి తీసుకొచ్చారు అని వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఓం రౌత్..

కథనం:
రామాయణంలో కొత్తగా కథ ఏముంటుంది.. అందరికీ తెలిసిందే.. ఇది కొన్ని వందల సార్లు ఇప్పటికే తెరమీద చూసాము. ఇప్పుడు మళ్లీ దీన్ని ఈ జనరేషన్ కోసం ఎంతో మోడ్రనైజ్ చేసి తీశాడు దర్శకుడు ఓం. దానికోసం ఆయన సినిమాటిక్ లీనియన్స్ చాలా తీసుకున్నాడు. వందల ఏళ్లుగా రామాయణం ఉంటే ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అయిన ఒక జనరేషన్ కు.. కాదు ఇంకోలా ఉంటుంది అని చూపిస్తే ఎలా ఉంటుంది.. ఆదిపురుష్ అచ్చంగా అలాంటి సినిమానే. ఇది రామాయణమే.. కానీ పూర్తిగా మోడ్రన్ రామాయణం.. క్యారెక్టర్స్ మాత్రం అవే ఉంటాయి కానీ.. వాటి అప్పియరెన్స్ ఊహించని విధంగా ఉంటాయి. ఈ జనరేషన్ కు తగ్గట్టు రామాయణాన్ని హై రేంజ్ టెక్నాలజీతో చెప్పాలని ప్రయత్నం చేశాడు ఓం రౌత్. కానీ ఎన్నో కోట్ల మంది ఆరాధించే ఒక ఇతిహాసాన్ని కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేసినప్పుడు విమర్శలు కూడా తప్పవు. ఈ విషయంలో ఆదిపురుష్ ఎన్నో విమర్శనాస్త్రాలు తట్టుకోవాల్సిందే. ముఖ్యంగా రావణుడి గెటప్ దగ్గర నుంచి ఆయన పాత్రను చిత్రీకరించిన తీరు వరకు.. ఏ ఒక్కటి కూడా మనము జీర్ణించుకోలేము. ఎంత మోడ్రన్ గా తీశామని చెప్పుకున్నా కూడా రావణుడి క్యారెక్టర్జేషన్ భరించలేము. ఆయన ఎంతటి శివ భక్తుడో అందరికీ తెలుసు.. అలాంటి భక్తుడికి సినిమాలో 90% బొట్టు లేకుండా చూపించడం వెనక ఉద్దేశం ఏంటో దర్శకుడుకే తెలియాలి. అంతేకాదు ఇప్పటి వరకు లంక రాజ్యం అంటే మనకు తెలిసిన విజువల్ వేరు. ఈ సినిమాలో మాత్రం లంక మొత్తం కేజిఎఫ్ మాదిరి ఉంటుంది.
అక్కడ మనుషులు ఎవరూ ఉండరు.. అందరూ రాక్షసులే ఉంటారు. అలాగే ఇప్పటి వరకు మనం చూసిన రామాయణంలో ఉండే కొన్ని సన్నివేశాలు ఇందులో వేరేలా చూపించారు. వీటన్నింటినీ కూడా కమర్షియలైజ్ అంటారేమో తెలియదు మరి. ఇన్ని మైనస్ లు ఉన్న సినిమాలో కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. హాలీవుడ్ లో ఎన్ని సూపర్ హీరో సినిమాలు వచ్చినా కూడా మన రామాయణ మహాభారతాల కంటే అవి గొప్పవి కాదు అని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. రాముడు, హనుమంతుడిని మించిన సూపర్ హీరోస్..
మన ఇతిహాసాల్ని మించిన సూపర్ కథలు ప్రపంచంలో లేరని చూపించారు.. హాలీవుడ్ యాక్షన్ సినిమాలా ఈ రామాయణం ఉంది. ఈ జనరేషన్ పిల్లలకు ఈ రామాయణం బాగా నచ్చుతుంది.

నటీనటులు:
ప్రభాస్ రాముడిగా బాగున్నాడు.. దేవుడి కంటే వీరుడిగా చూపించారు. ముఖ్యంగా ఆ క్యారెక్టర్ లో బాహుబలి ఛాయలు ఎక్కువగా కనిపించాయి. సీతగా కృతి సనన్ బాగుంది.. స్క్రీన్ మీద నిండుగా కనిపించారు. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ చాలా కొత్తగా ఉన్నారు.. జీర్ణించుకోలేనంత కొత్తగా కనిపించారు. హనుమంతుడి క్యారెక్టర్ అలరిస్తుంది.. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నికల్ టీమ్:
ఆదిపురుష్ సినిమాకు సంగీతం ప్రాణం. ప్రతి పాట అలరిస్తుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు ప్రధానమైన వెన్నుముక అదే. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉంది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ కాస్త ట్రిమ్ చేసుంటే ఇంకా బాగుండేది. విజువల్ ఎఫెక్ట్స్ అత్యున్నతంగా ఉన్నాయి. ఈ విభాగంలో ఆదిపురుష్ మార్కులు బాగానే కొట్టేస్తాడు. విజువల్ గా ఆదిపురుష్ హై రేంజ్ లో ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.. కానీ ఇదే రామాయణం అనుకునే ప్రమాదం లేకపోలేదు.

పంచ్ లైన్:
ఓవరాల్ గా ఆదిపురుష్.. మోడ్రన్ రాముడు.. విజువల్స్ వరకు ఓకే..