ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో పుట్టింటికి ఎందుకు వెళ్లలేదని సీతారామయ్య అడుగుతాడని.. అక్కడక్కడే కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది కావ్య. ఈ క్రమంలోనే రాజ్ పై నుంచి వచ్చి పేపర్ చదువుతూ ఉండగా.. అది లాక్కుని సీతారామయ్యకి ఇస్తుంది కావ్య. తాతయ్య ఇంకా అడగటం లేదని ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య. ఆ తర్వాత కాఫీ తీసుకొచ్చి సీతారామయ్యకి ఇచ్చి.. ఈ రోజు ఇంకా ఇక్కడే ఉంటాను. మీకు ఏం కావాలన్నా అడగండి అని అంటుంది కావ్య. దానికి సీతారామయ్య అదేంటమ్మా.. సహాయం చేయడానికి నీ పుట్టింటికి వెళ్తావు అన్నావు కదా.. అని అడుగుతాడు. ఈ లోపు రాజ్ అందుకేనా.. బావురు పిల్లిలా తాతయ్య చుట్టూ తిరుగుతుంది.. నా కొంప ముంచే పని ఏదో చేసేదానిలా ఉందని అనుకుంటూ ఉంటుంది. లేదు తాతయ్య మీ మనవడు అని కావ్య ఏదో చెబుతుండగా.. నేనే నేనే వద్దు అన్నా తాతయ్య.. అని రాజ్ చెప్తుండగా.. అదేంట్రా నేను వెళ్లమన్నాను కదా అని సీతారామయ్య అంటాడు. అవును తాతయ్య.. ఇవాళ మంచిది కాదంట.. పంతులు చెప్పాడు అని రాజ్ అనగా.. ఎవడా పంతులు తప్పు చెప్పాడు.. ఇవాళ దివ్యమైన రోజు అంటూ సీతారామయ్య అంటాడు. ఇక కావ్య చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్తాడు రాజ్. ఏంటండి ఇలా పట్ట పగలే గదిలోకి తీసుకొచ్చారు అంటూ కావాలని ఆటపట్టిస్తూ ఉంటుంది. రాత్రిపూటే దిక్కు లేదు.. పగలు చేయడగానికి ఏం ఉంటుంది నా బొంద అని రాజ్ అనగా.. అవును నిజమే అంటుంది కావ్య. మరి ఎందుకండి పట్టపగలు నా చేయి పట్టుకుని తీసుకొచ్చారు అంటూ కావ్య విసిగిస్తూ ఉంటుంది.
రాజ్ మాత్రం ఉక్రోశంతో నువ్వు కావాలనే తాతయ్య దగ్గర ఓవర్ యాక్షన్ చేశావు కదా అంటాడు. హా నేనా.. ఓవర్ యాక్షనా.. రండి మళ్లీ తాతయ్య దగ్గరకు వెళ్లి అడుగుదాం అంటూ కావ్య అనగా.. వద్దులే మళ్లీ ఇరికించాలని చూస్తున్నావా అని రాజ్ అంటాడు. లేదు మీకు క్లారిటీగా చెప్పించాలని అని కావ్య చెప్తుంది. ఏం అక్కర్లేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత కాంట్రాక్టర్ శ్రీనుకి కాల్ చేసి.. క్యాన్సిల్ చేసిన ఆర్డర్ తిరిగి వాళ్లకే ఇచ్చేయి అని చెప్తాడు. ఈలోగా రాహుల్ పై అరుస్తుంది స్వప్న. ఇప్పుడు ఏమైందని అరుస్తున్నావ్ అని రాహుల్ అడుగుతాడు. చుట్టూ ఏం జరుగుతుందో కనిపించడం లేదా? అని స్వప్న అడుగుతుంది. సూటిగా సుత్తి లేకుండా చెప్తున్నాను.. ప్రేమించానని వెంటపడ్డావు గానీ.. ఏం ప్రయోజనం.. అక్కడ కావ్యతో నువ్వంటేనే ఇష్టం లేదని చెప్పి రాజ్.. తన భార్యని ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు. అడిగినవన్నీ ఇస్తున్నాడు. కొన్ని సార్లు అడక్కుండానే అన్నీ చేసి పెడుతున్నాడు. నువ్వు కూడా ఉన్నావు ఎందుకు? సిగ్గులేదు నీకు.. అని స్వప్న రాహుల్ ని నిలదీస్తుంది. ఇదంతా పై నుంచి రాజ్ చూస్తాడు. నేను కళావతికి అన్ని చేస్తున్నానా అనుకుంటాడు. ఇప్పుడేం తక్కువైంది నీకు.. అని రాహుల్ అడగ్గా.. ప్రేమ.. ప్రేమ తక్కువైంది అంటుంది.
కావ్య అవసరాలన్నీ చూసుకుంటున్నాడు. తనకు కష్టం వస్తే తన పక్కనే ఉండి సపోర్ట్ చేస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం బుద్ధ విగ్రహంలా ఒకే చోట కూర్చున్నావ్. అసలు నీకొక భార్య ఉందన్న విషయం.. నీకు గుర్తుందా అని ప్రశ్నిస్తుంది స్వప్న. కళావతి నాకు తెలీకుండా ఇన్ని సహాయాలు నా దగ్గర నుంచి ఎప్పుడు తీసుకుంది అని రాజ్ అనుకుంటాడు. నా చెల్లెలు ఏం మందు పెట్టిందో ఏమో కానీ.. తను ఎలా చెప్తే రాజ్ అలా ఆడుతున్నాడు. కనీసం దాని దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుని.. నిన్ను కూడా అలాగే కంట్రోల్ లో పెడతాను అంటూ రాహుల్ పై చిందులు వేస్తుంది స్వప్న. ఇదంతా పై నుంచి చూసిన రాజ్ మనసులో.. వీళ్లందరూ నా గురించి అలా అనుకుంటున్నారా.. ఏదో ఒకటి చేయాలి అంటూ చిరాకు పడుతూ ఉంటాడు. ఎలాగైనా కావ్యని తన పుట్టింటికి వెళ్లకుండా ఉండాలని చూస్తాడు. అందరూ దీన్ని నేను చాలా ప్రేమిస్తున్నాను అనుకుంటున్నారు అని సతమతమవుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఓ ప్లాన్ వేస్తాడు. బాత్రూమ్ బయట ఆయిల్ పోసి.. కావ్య పడుపోతుందేమోనని చూస్తాడు.
ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్ ని తిడుతూ ఉంటుంది అప్పు. ఫోన్ నెంబర్ కూడా లేకుండా ఎలారా భయ్ అంటూ చిర్రుబుర్రులాడుతూ ఉంటుంది. కానీ నాకు భలే త్రిల్ గా ఉంది అంటాడు కళ్యాణ్. నీ ఆట నువ్వు ఆడుకోవచ్చు కదా.. నాకెందుకు అంటుంది అప్పు. ఇంతేనా స్నేహం అంటే ఇంతేనా.. బంధుత్వం అంటే ఇంతేనా.. సాటి వాడు సహాయం అడిగితే.. హెల్ప్ చేయలేవా అంటాడు కళ్యాణ్. ఓవరాక్షన్ చేయకరా భయ్.. ఇప్పుడేంటి? ఆ పోరి నెంబర్ దొరకబట్టాలి అంతే కదా అని అప్పు అడగ్గా.. అక్కర్లేదు ఫోన్ నెంబర్ బట్టి.. ఆ అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ బట్టి పట్టుకుని వెళ్లి మనం అనామికను పట్టుకోవాలి అంటాడు కళ్యాణ్. అడ్రస్ లో ఉన్న పేరు చూసి నవ్వుకుంటారు. ఈ అడ్రస్ వెతికి ఎలాగైనా అనామికను పట్టుకోవాలని అంటాడు.
ఇక నెక్ట్స్ బాత్రూమ్ ముందు నూనె పోసి.. పక్కన ఉండి చూస్తూంటాడు రాజ్. బాత్రూమ్ నుంచి కావ్య పాడుకుంటూ వస్తుంది. మా ఆయన ఎంతలా ఎదిగిపోయారో.. ఆ నూనెపై కాలు వేసి.. భార్య కింద పడి నడుం విరగ్గొట్టుకుని.. బెడ్ ఎక్కాలని.. ఎంత గొప్ప ప్రయత్నం చేశారు..మీ పప్పులేమీ ఉడకలేదు. ఇక చాటు నుండి చూసింది చాలు రండి బయటకు అని అంటుంది. నేను పడాలనే ఇక్కడ నూనె పోశారు కదా అని అంటుంది కావ్య.. నీ దగ్గర సాక్ష్యం ఉందా.. సాక్ష్యం లేకుండా మాట్లాడకు. లేని పోని అభండాలు వేయకు నా మీద అని రాజ్ అంటాడు. ఏవండీ ఈ వీడియోలో ఎవరో మీలాగే ఉన్నారు అని అక్కడ రికార్డు చేసిన వీడియో చూపిస్తుంది కావ్య. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ఇక ఈరోజుతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.