Brahmamudi Serial: రెచ్చిపోయిన అపర్ణ, రుద్రాణిలకు షాక్ ఇచ్చిన సీతారామయ్య.. కావ్య హాపీ.. టెన్షన్ లో రాజ్!!

|

Aug 14, 2023 | 12:37 PM

ఈలోపు సీతారామయ్య వచ్చి.. ఇక చాలు ఆపండి.. అసలు నా మనవరాలు ఏం తప్పు చేసిందని.. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెబుతున్నారు? అని అంటాడు. రుద్రాణి కలుగచేసుకుని.. ఏదో చెప్పబోతే.. రుద్రాణి.. అంతా తెలుసుకునే వచ్చాను. మీరంతా అనుకుంటున్నట్టుగా కావ్య మన పరువు తియ్యలేదు.. నిలబెట్టింది. కావ్య ఈ పని చేసి.. తనకు మనం ఎంత స్వేచ్ఛని ఇచ్చామో..ఎంత ప్రోత్సహిస్తున్నామో చెప్పింది అని అంటాడు సీతారామయ్య. కానీ మావయ్య గారూ.. అంటూ అపర్ణ ఆపుతుంది. అపర్ణ.. కావ్య ఆత్మాభిమానం కలిగిన మనిషి అని అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో తన పుట్టింటికి..

Brahmamudi Serial: రెచ్చిపోయిన అపర్ణ, రుద్రాణిలకు షాక్ ఇచ్చిన సీతారామయ్య.. కావ్య హాపీ.. టెన్షన్ లో రాజ్!!
Brahmamudi Serial
Follow us on

ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యని దుగ్గిరాల ఫ్యామలీ అంతా నిలదీస్తుంది. ఇందిరా దేవి కూడా పెద్దవాళ్లు ఒకసారి చెప్పేది వినమ్మ అంటూ చెబుతుంది. అమ్మమ్మ గారూ మీరు కూడా నన్నే తప్పు పడుతున్నారా.. కన్నవాళ్లకు సహాయం చేయడం మీ దృష్టిలో తప్పు అవుతుందా? అని కావ్య అడుగుతుంది. అందుకే కదా నేను సహాయం చేస్తాను అంటున్నాను అని అంటాడు రాజ్. ఏ రకంగా చేస్తారు? శ్రీను గారితో ఫోన్ లో మాట్లడినట్టు సహాయం చేస్తారా? అని కావ్య అడుగుతుంది. శ్రీను ఎవరురా? అని సుభాష్ అడుగుతాడు. అసలు ఇవన్నీ అనవసరం అండి అని అపర్ణ కలుగజేసుకుని.. ఈ ఇంటి కోడలిగా ఉండాలి అంటే.. ఇక్కడ అందరికీ నచ్చిట్టు ఉండాలి. అలా ఉండటం కుదురుతుందో.. లేదో అడగండి అంటూ రెచ్చిపోతుంది అపర్ణ. తప్పు చేస్తుంది మీరు.. మా వాళ్లను బెదరించారు. నా స్వచ్ఛను లాక్కుంటున్నారు. కాబట్టి నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అని తెగేసి చెప్తుంది కావ్య. మా పుట్టింటికి నా వల్ల చేసినంత సహాయం చేస్తూనే ఉంటాను. అయితే నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పేస్తుంది అపర్ణ. ఏంటి అపర్ణ ఏం మాట్లాడుతున్నావ్.. అని ఇందిరా దేవి అడుగుతుంది. నేను మాట్లాడేది వినండి అత్తయ్యా.. ఇప్పటివరకూ మీ మనవరాలు మాట్లాడింది విన్నారు కదా.. ఇప్పుడు నేను కూడా నా నిర్ణయం చెబుతున్నా.. పుట్టింటికి వెళ్లి అలాగే రంగులు వేసుకుంటూ మన ఇంటి పరువు తియ్యాలి అనుకుంటే మాత్రం.. కావ్య ఈ ఇంట్లో ఉంటే ఒప్పుకోను. వెళ్లు.. వెళ్లి నీ పుట్టింట్లోనే నీకు నచ్చి ఉండు.. నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండదు అని అపర్ణ అంటుంది.

ఈలోపు సీతారామయ్య వచ్చి.. ఇక చాలు ఆపండి.. అసలు నా మనవరాలు ఏం తప్పు చేసిందని.. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెబుతున్నారు? అని అంటాడు. రుద్రాణి కలుగచేసుకుని.. ఏదో చెప్పబోతే.. రుద్రాణి.. అంతా తెలుసుకునే వచ్చాను. మీరంతా అనుకుంటున్నట్టుగా కావ్య మన పరువు తియ్యలేదు.. నిలబెట్టింది. కావ్య ఈ పని చేసి.. తనకు మనం ఎంత స్వేచ్ఛని ఇచ్చామో..ఎంత ప్రోత్సహిస్తున్నామో చెప్పింది అని అంటాడు సీతారామయ్య. కానీ మావయ్య గారూ.. అంటూ అపర్ణ ఆపుతుంది. అపర్ణ.. కావ్య ఆత్మాభిమానం కలిగిన మనిషి అని అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో తన పుట్టింటికి.. తన కష్టంతో సహాయం చేయాలని అనుకోవటం తప్పు కాదు. తనకున్న నైపుణ్యంతో ఎదగాలి అనుకోవడంలో న్యాయం ఉంది. అలా చేస్తే మనమేదో తనని పట్టించుకోవడం లేదని.. టార్చర్ పెడతారని అనుకుంటారు కదా నాన్న అని రుద్రాణి అంటుంది. అలా అని ఎవరూ అనుకోవడం లేదు.. నిజం చెప్పాలంటే మీరు కావ్య విషయంలో ఇలానే ప్రవర్తించారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా.. ఇక పై కావ్య తన పుట్టింటికి వెళ్తుంది.. నచ్చిన పని చేస్తుంది. ఎవరూ అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. ఈ ఇంటి పెద్దగా నేను ఈ నిర్ణయం తీసుకున్నా అని స్పష్టం చేస్తాడు సీతారామయ్య. ఈ నిర్ణయంపై రాహుల్-రుద్రాణి తిట్టుకుంటారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోతారు. ఆ తర్వాత కావ్య థాంక్స్ తాతయ్య గారూ మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు. అందరూ నాది అహంకారం అనుకుంటున్నారు. మీరొక్కరే అది ఆత్మాభిమానం అని అర్థం చేసుకున్నారు అని కావ్య అంటుంది. నీకు నేనున్నాను అమ్మా అని ధైర్యం చెబుతాడు సీతారామయ్య.

ఈ సీన్ కట్ చేస్తే.. కనకం, కృష్ణమూర్తి దిగాలుగా కూర్చొని బాధపడతారు. ఒక మంచి జరిగింది అనగానే.. రెండింతల చెడు జరగాలని మనలాంటి మధ్య తరగతి వాళ్ల నుదుటున రాశాడేమో ఆ దేవుడు అంటూ కృష్ణమూర్తి. మనకు ఎన్ని సమస్యలు వచ్చినా.. అది మనదాకా అయితే ఫర్వాలేదు కానీ.. అని బాధపడుతుంది. కావ్య అక్కడ ఎలా ఉందో అని మదన పడుతుంది కనకం. కానీ మనం ఏం చేయలగలం చెప్పు.. ఆడబిడ్డని మనకంటే ఉన్నవాళ్లకు ఇచ్చి చేయమంటారు కానీ.. ఇలాంటి కష్టం వస్తే నిలదీసే బలం ఉండదని ఎందుకు ఆలోచించారు అని కృష్ణమూర్తి అనగా.. కావ్యని ఈ కష్టం నుంచి ఎలా బయటపడేయాలి అని కనకం అడుగుతుంది. మనకు కష్టం వస్తే.. కావ్య ఇలానే వస్తూ ఉంటుంది. అడ్డుపడితే అత్తారింటిని కూడా ఎదిరిస్తుంది. నా కూతురు గురించి నాకు బాగా తెలుసుకు కనకం. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నా.. ఇల్లు అమ్మేద్దాం అని అంటాడు. కనకం షాక్ అవుతుంది. కావ్యకు ఎంత చెప్పినా వినుపించుకోదు. దీంతో అప్పుడు కావ్య మన ఇంటికి రాదు కదా అని చెప్తాడు కృష్ణమూర్తి. కనకం మాట్లాడుతూ.. మీరు చెప్పింది కూడా కరెక్ట్ నే అంటుంది. ఇన్నాళ్లూ ఇల్లు దూరం అయిపోతుంది అనుకున్నాను కానీ.. కావ్య కాపురం కంటే ఏదీ ఎక్కువ కాదు అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూంటారు.

ఇవి కూడా చదవండి

ఇక నెక్ట్స్.. కబోర్డులోని పరుపు తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది కావ్య. ఉండు నేనుతీస్తాను అంటాడు రాజ్. నేను నా పరుపు నేను తీసుకోగలను. నువ్వు పరుపు మాత్రమే కాదు.. పరువు కూడా తీయగలవు. అంత పరువు తక్కువ పని నేనేం చేశానని కావ్య అనగా.. ఇంత బరువు ఎక్కువ పని చేయడం అవసరమా అని రాజ్ అంటాడు. దాని గురించి ముందు పరువు గురించి ఏదో అన్నారు కదా అని కావ్య అడుగుతుంది. మా తతయ్య సపోర్ట్ తీసుకుని.. వీరనారిలా, రుద్రనారిలా రెచ్చిపోదాం అనుకుంటున్నావేమో.. అని రాజ్ తిట్టగా.. అలా రెచ్చిపోయేదాన్ని అయితే.. నాకు వచ్చిన కాంట్రాక్ట్ ని మీరు క్యాన్సెల్ చేయించిన విషయం అందరికీ చెప్పేసేదాన్ని. అప్పుడు మీతోనే ఆ కాంట్రాక్ట్ ని తిరిగి నాకు ఇప్పించే వాళ్లు అని కావ్య చెబుతుంది. వాళ్లందరూ చెప్పినా సరే.. నువ్వు అక్కడికి వెళ్లడం నాకు ఇష్టం లేదు అని అంటాడు రాజ్. దీనికి కావ్య.. ఏంటి ఒప్పుకోరా.. ఒప్పుకోను.. అస్సలు ఒప్పుకోరా.. ఒప్పుకోను.. నిజమా.. సరే నేను వెళ్లను లెండి అని కావ్య చెబుతుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ఏంటి ఇంతలా ఈజీగా చెప్పింది. అని తనలో తానే మాట్లాడుకుంటాడు. ఇదేంటబ్బా.. కొంపదీసి ఫిటింగ్ లాంటివి ఏమన్నా పెట్టబోతుందా. తాతయ్య ఓకే అని చెప్పిన తర్వాత కూడా ఇంకా రెచ్చిపోతుంది అనుకున్నాను కానీ.. ఇంత ఈజీగా ఎలా ఒప్పుకుందేంటి? అని రాజ్ ఆలోచిస్తూం ఉంటాడు. ఒకసారి తననే అడిగితే సరిపోతుంది కదా.. అని లేపుతామని.. పైనుంచి జారి పడి కావ్యపై పడతాడు.

దీంతో కావ్య ఒక్కసారిగా ఉలిక్కి పడి.. లేచి అరుస్తుంది. ఏయ్ ఏయ్ అరవకు.. అర్థరాత్రి అందరూ వచ్చి అడ్డమైన ప్రశ్నలన్నీ వేస్తారు అంటాడు రాజ్. ఒక విషయం అడగాలని.. ఏంటా ఈ విషయం అని కావ్య అడుతుంది. అసలు మీ ఇంటికి పని చేయనని ఎందుకు అంత సింపుల్ గా ఒప్పుకున్నావ్.. ఏంటది.. అసలు ఆ విషయం తెలిసే వరకూ నాకు నిద్ర పట్టేలా లేదంటూ టెన్షన్ గా ఫీల్ అవుతాడు. అయ్యో దేవుడా.. దీనికా.. మీతో ఒప్పుకన్నా ప్రాబ్లమే.. ఒప్పుకోకపోయినా ప్రాబ్లమే.. గుడ్ నైట్ అని చెబుతూ కావ్య పడుకుంటుంది. అయినా రాజ్ ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక తెల్లవారితే.. కావ్య టేబుల్ తుడుస్తూ.. ఇదేంటి ఇందాకన్నుంచి ఇక్కడే ఉన్నా.. తాతయ్య ఏమీ అడగటం లేదేంటి? అని మనుసులో అనుకుంటుంది. ఇదేంటి ఇందాకే క్లీన్ చేశావ్ కదా.. మళ్లీ చేస్తున్నావేంటి? అని స్వప్న అడుగుతుంది. నిన్న కూడా నేను క్లీన్ చేయలేదు కాబట్టి అని కావ్య చెప్పగా.. వరండాలో వారం రోజుల నుంచి శుభ్రం చేయలేదంట.. అక్కడకు వెళ్లు మరి అని స్వప్న చెబుతుంది. అక్కడ తాతయ్య ఉండరు కదా అని కావ్య అంటుంది. ఏంటి తాతయ్య ఎందుకు? అని స్వప్న అడగ్గా.. పాలు తాగితే బలం వస్తుంది.. నన్ను ప్రశ్నలు అడిగితే నీకు నీరసం వస్తుందని కావ్య సమాధానం చెబుతుంది. ఈలోగా రాజ్ పై నుంచి వచ్చి పేపర్ చదువుతూ ఉంటాడు. కావ్య వచ్చి తాతయ్య గారూ మీరింగా పేపర్ చదవలేదు కదా అని రాజ్ దగ్గర నుంచి లాక్కుని సీతారమయ్యకు ఇస్తుంది కావ్య. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.