ఉరవకొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Payyavula Keshav 102046 TDP Won
Yellareddy Gari Visweswara Reddy 80342 YSRCP Won
Madhusudhan Reddy Yellareddigari 4529 INC Won
Anke Thippeswamy 3832 BSP Won
Visweswaraiah 469 IND Won
Kuruba Chinnakka 355 AIKJP Won
Vaddireddy Chandrasekhar Reddy 293 IND Won
Kapu Damodar Reddy 228 IND Won
Karanam Bharangi Mohandas 178 IND Won
Yarrannagari Ramanjineyalu 177 JBNP Won
B. Pavan Kumar 158 BCYP Won
ఉరవకొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అనంతపురం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉరవకొండ ఒకటి. 1962లో ఏర్పాటైన ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఉరవకొండ, కూడేరు, బెళుగుప్ప, వజ్రకరూరు, విడపనకల్లు మండలాలు వస్తాయి. 1983 నుంచి 2019 వరకు ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కమ్మ, రెడ్డి, బోయ సామాజికవర్గాలకు చెందిన నేతలే పోటీ పడుతున్నారు. ఉరవకొండలో టీడీపీ అత్యధికంగా ఐదుసార్లు గెలవగా.. కాంగ్రెస్ నాలుగుసార్లు విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు సైతం రెండుసార్లు గెలవగా.. వైఎస్సా్ర్సీపీ ఒకసారి విజయం సాధించింది. 1962లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన గుర్రం చిన్న వెంకన్న ఉరవకొండ తొలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1972లో బుక్కిట్ల బసప్ప స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్.వేమన్న ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత.. 2019 వరకు తొమ్మిదిసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులే ఉరవకొండ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1983లో వై.భీమా రెడ్డి, 1985లో గుర్రం నారాయణప్ప టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 1994లో పయ్యావుల కేశవ్ ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలిచిన.. 2004, 2009, 2019ల్లోనూ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1989లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వసికేరి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో హస్తం పార్టీకి చెందిన ఎల్లారెడ్డి గారి శివరామ రెడ్డి ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత మళ్లీ ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వై.విశ్వేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. పయ్యావుల కేశవ్ 1994 నుంచి 2019 వరకు నాలుగుసార్లు ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగుసార్లు పయ్యావుల కేశవ్, వై.విశ్వేశ్వర రెడ్డి ఉరవకొండలో ముఖాముఖి తలపడ్డారు. అందులో మూడుసార్లు 2,500 కంటే తక్కువ ఆధిక్యం రావడాన్ని బట్టి.. ఇద్దరి మధ్య పోరు ఎంత రసవత్తరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక, 2024లో ఎన్నికల్లో గెలుపోటములు ఆసక్తికరంగా మారాయి.

ఎన్నికల వీడియో