రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Miriyala Sirisha Devi 90087 TDP Won
Nagulapalli Dhanalakshmi 80948 YSRCP Won
Lotha Ramarao 21265 CPM Won
Pallala Latchi Reddy 3061 IND Won
Kakuru Kannam Reddy 2191 BSP Won
Bangaru Venkatesh 1224 IND Won
Paladugu Sri Venkateswara Rao 878 IND Won
Paladugu Lakshmi Prasanna 800 IND Won
Madditi Anji Reddy 754 BADVP Won
Kunja Srinu 749 IND Won
Dumanthu Viswanadham 651 RPI Won
Manupudi Subba Rao 631 PPOI Won
రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం: ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన నియోజకవర్గాలలో రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ రంపచోడవరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గంలో 2019 లెక్కల ప్రకారం మొత్తం 1,57,530 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మారేడుమిల్లి, దేవీపట్నం, వై. రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి, కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం, ఎటపాక మండలాలు ఉన్నాయి. 2014, 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. 2014 అసెంబ్లీ ఎన్నికల బరిలో వంతల రాజేశ్వరి గెలవగా.. 2019లో నాగుల ధనలక్షి గెలుపొందారు. ఇది ఎస్టీ సామాజికవర్గానికి చెందిన రిజర్వుడు నియోజకవర్గం. 2014లో తెలుగుదేశం నుంచి సీతంశెట్టి వెంకటేశ్వరరావు తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడి వైసీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరి చేతిలో ఓడిపోయారు. 2019లో వంతల రాజేశ్వరి టీడీపీలో చేరి పోటీ చేసినప్పటికీ వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి చేతిలో భారీ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
రంపచోడవరంలో ప్రధానంగా వైఎస్సార్సీపీ, తెలుగుదేశం మధ్య ప్రధాన పొటీ ఉంటుంది. రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం ఇంకా అభ్యర్థిని ప్రటించలేదు. వైసీపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నాగులపల్లి ధనలక్షి పేరును పరిశీలిస్తోంది.

ఎన్నికల వీడియో