కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Muppidi Venkateswara Rao 92743 TDP Won
Venkata Rao Talari 58797 YSRCP Won
Arigela Aruna Kumari 1897 INC Won
Sekhar Babu Koyya 1255 RPC(S) Won
Bonta Syam Ravi Prakash 652 LIBCP Won
Uba Srikanth 369 IND Won
Bontha Kishore 258 IND Won
Muppidi Sekhar Babu 194 NVCP Won
Tatapudi Praveen 166 IND Won
Kamala Arugolanu 152 IND Won
Kokkiripati Chinababu 163 IND Won
కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం: ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన నియోజకవర్గాలలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ కొవ్వూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇది రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గంలో 2019 లెక్కల ప్రకారం మొత్తం 1,76,409 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో చాగల్లు, తాళ్లపూడి, కొవ్వూరు మండలాలు ఉన్నాయి. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కెఎస్ జవహర్ గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్‎లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో తానేటి వనిత వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందారు. గతంలో మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగి.. ప్రస్తుతం కీలకశాఖ అయిన హోం శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇది ఎస్టీ సామాజికవర్గానికి చెందిన రిజర్వుడు నియోజకవర్గం. 2014లో కెఎస్ జవహర్ తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలిచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తానేటి వనితపై విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత తో పోటీపడ్డ తానేటి వనిత వైసీపీ తరఫున ఘన విజయం సాధించారు. 2019లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి బీఎస్పీ కూడా పోటీ చేసింది. బీఎస్పీ అభ్యర్థిగా తంబళ్లపల్లి రవికుమార్ మూర్తి పోటీ చేశారు.

కొవ్వూరులో ప్రధానంగా వైఎస్సార్సీపీ, తెలుగుదేశం మధ్య ప్రధాన పొటీ ఉంటుంది. కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ఇంకా అభ్యర్థిని ప్రటించలేదు. వైసీపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తానేటి వనిత పేరును మరోసారి పరిశీలిస్తోంది.

ఎన్నికల వీడియో