డోన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Kotla Jaya Surya Prakash Reddy 93523 TDP Won
Buggana Raja Reddy 87474 YSRCP Won
Garlapti Maddulety Swamy 3988 INC Won
C.S.C. Reddy 825 IND Won
Rudravaram G.Ramudu 784 BSP Won
K. S. Reddy 686 IND Won
M.V.Reddy 324 IND Won
Kommuru Ravi Kumar 187 IND Won
Akhil Kumar Chennuru 184 IND Won
Polur Nagendra Babu 131 IND Won
Paiyinti Anand 123 IND Won
Prasad 135 IND Won
Avula Mahesh 115 IND Won
Tarigopula Balu Yadav 116 BCYP Won
Balapala Kumara Swamy 91 JCVIVP Won
Jaradoddi Chinna Jayaramudu 72 IND Won
డోన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్ అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత ఆసక్తిని కలిగిస్తుంది. ప్రతిసారి ఉద్దండులు పోటీ పడుతుండటం, పార్టీ అధికారంలోకి వచ్చిన నేతలు ఉన్నత పదవుల్లోకి రావడం ఇక్కడ ప్రజల అదృష్టంగా స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, రావు బహుదూర్ బుగ్గన శేషారెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారే కావడం విశేషం. దానధర్మాలు, విద్యాసంస్థలు, వైద్యశాలలకు ఉచితంగా స్థలాలు ఇవ్వడమే కాకుండా వాటిని కట్టించిన బుగ్గన శేషారెడ్డికి అప్పట్లోనే రావు బహదూర్ ప్రధానం చేశారు. ఆయన కట్టించిన విద్యాసంస్థలు వైద్య సంస్థలు గురించి ఇప్పటికి బేతంచర్ల లో స్థానికులు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి శేషారెడ్డి 1955లో మొదటిసారి జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్రకి ఎక్కారు. ఇక అప్పటినుంచి డోన్ అసెంబ్లీకి మహామహులు పోటీ చేయడం ఉన్నత పదవులు అనుభవించడం జరుగుతూ వస్తోంది. అందులో భాగంగానే 1962లో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, 1978 నుంచి 1994 వరకు, 2009లో మరోసారి కేఈ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా మంత్రిగా డోన్ నియోజకవర్గం నుంచే గెలుపొందారు. 1994లో ముఖ్యమంత్రి హోదాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి డోన్ నుంచి పోటీ చేసి సీపీఐ ముఖ్యనేత సురవరం సుధాకర్ రెడ్డిపై గెలుపొందారు. కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్ 1996 ఉప ఎన్నికలలో, 1999 సాధారణ ఎన్నికలలో గెలుపొందారు. ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. 2004లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోడలు కోట్ల సుజాత కేఈ ప్రభాకర్ పై గెలుపొందారు. వైసీపీ ఆవిర్భావంతో డోన్ ఆ పార్టీకి కంచుకోటలా మారిందని చెప్పవచ్చు. 2014లో 2019లో కేఈ కృష్ణమూర్తి తమ్ముడు ప్రతాప్ పై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఈసారి కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రంగంలోకి దించింది. ఇప్పటికే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కోట్ల సుజాత, కోట్ల హరిచక్రపాణి రెడ్డి పోటీ చేయగా తాజాగా కేంద్ర మాజీ మంత్రి సూర్య ప్రకాష్ రెడ్డి యుద్ధానికి సిద్ధమయ్యారు. రాబోయే ఎన్నికలలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సూర్యప్రకాశ్ రెడ్డి ఢీకొనబోతున్నారు. ఎవరిదిపై చేయి అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

ఎన్నికల వీడియో