కొణతాల రామకృష్ణ ఎన్నికల ఫలితాలు 2024

కొణతాల రామకృష్ణ ఎన్నికల ఫలితాలు 2024
ANAKAPALLE JSPJSP
Won 115126

కొణతాల రామకృష్ణ.. అనకాపల్లి రాజకీయాల్లో పేరుగాంచిన రాజకీయ నాయకుడు. 1957, జనవరి 4న అనకాపల్లి పట్టణంలో కొణతాల రామకృష్ణ జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.కాం. పట్టా పొందారు. వ్యవసాయదారుడిగా, వ్యాపారిగా, పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా ఎన్నో సేవలను అందించారు కొణతాల రామకృష్ణ. గవర నాయుడు కమ్యూనిటీ చెందిన కొణతాల రామకృష్ణ.. అనకాపల్లిలో ఆ వర్గం నుంచి బలమైన నాయకుడిగా ఎదిగారు. 1980వ దశకంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ అరంగేట్రం చేశారు కొణతాల. అనకాపల్లి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు కొణతాల. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు కొణతాల రామకృష్ణ. రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన కొణతాల.. ఆయన మరణానంతరం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంటు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత టీడీపీలోకి చేరిన కొణతాల రామకృష్ణ.. 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఇక ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

ఎన్నికల వీడియో