SSC JHT 2023 Notification: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 307 జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌

|

Aug 23, 2023 | 1:35 PM

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దాదాపు 307 జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 'జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్-2023' ఆధారంగా ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు..

SSC JHT 2023 Notification: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 307 జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌
SSC JHT 2023
Follow us on

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దాదాపు 307 జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ‘జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్-2023’ ఆధారంగా ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 12, 2023వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మంత్రిత్వ శాఖలు/విభాగాల వివరాలు ఇవే..

కాగ్‌, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కన్‌జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్‌ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, కామర్స్ అండ్‌ ఇండస్ట్రీ, సైన్స్ అండ్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇన్ఫర్మేషన్ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్, ఏఐఆర్‌ హెడ్‌ క్వార్టర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ తదితరాలు.

ఏయే అర్హతలు ఉండాలంటే..

నోటిఫికేషన్‌లో ఇచ్చిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆ అర్హతలుండాలి.

ఇవి కూడా చదవండి
  • జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. దీంతో పాటు ట్రాన్స్‌లేషన్‌(హిందీ/ఇంగ్లిష్) డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.
    లేదా
    ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలో రెండేళ్ల ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి.

 

  • సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు మూడేళ్ల ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీ (హిందీ/ఇంగ్లిష్) అర్హత ఉండలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా చదివి ఉండాలి. ఏదైనా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీనియర్ సెకండరీ స్థాయిలో రెండేళ్లకు తగ్గకుండా హిందీ టీచింగ్‌లో అనుభవం ఉండాలి.

వయోపరిమితి వివరాలు

దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాతపరీక్ష (పేపర్-1, పేపర్-2), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైతే నెలకు జేటీ/ జేహెచ్‌టీ పోస్టులకు రూ.35400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు. ఎస్‌హెచ్‌టీ పోస్టులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

పోస్టుల వివరాలు..

  • జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు:10
  • జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులు: 287
  • సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు: 10

ముఖ్య తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: ఆగస్టు 22, 2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 12, 2023.
  • దరఖాస్తు సవరణ తేదీలు: సెప్టెంబర్‌ 13, 14
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1) తేదీ: అక్టోబర్, 2023.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.