BECIL Recruitment 2023: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇదే..

|

Mar 28, 2023 | 1:57 PM

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) డెహ్రాదూన్‌, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబయి, హల్ద్‌వనిలోని పవన్‌హాన్స్‌ లిమిటెడ్‌లో.. స్టేషన్‌ మేనేజర్‌, ఆఫీసర్‌ సర్వీసెస్‌, అసిస్టెంట్‌, బేస్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన..

BECIL Recruitment 2023: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇదే..
BECIL
Follow us on

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) డెహ్రాదూన్‌, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబయి, హల్ద్‌వనిలోని పవన్‌హాన్స్‌ లిమిటెడ్‌లో.. స్టేషన్‌ మేనేజర్‌, ఆఫీసర్‌ సర్వీసెస్‌, అసిస్టెంట్‌, బేస్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ బీకామ్‌/ ఎంబీఏ/ పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 నుంచి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 29, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీ అభ్యర్ధులు రూ.885, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌/పీహెచ్‌ అభ్యర్ధులు రూ.531లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.17,446ల నుంచి రూ.24,440ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.